Naga Chaitanya : అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య సినిమాల సంగతేమో కాని ఇతర విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ అనుకోని కారణాల వలన ఆమెకి విడాకులు ఇచ్చాడు. అప్పటి నుండి ఆమెకి దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట. అంతేకాదు వాటికి సంబంధించిన భారీ కలెక్షనే ఉంది చైతూ వద్ద. వాటి రేట్ తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం. చైతూకి స్పోర్ట్స్ కార్లు, బైకులంటే ఇష్టమట. కొత్త మార్కెట్‌లో ఏ కొత్త బైక్ వచ్చినా అది తన షెడ్‌లో ఉండాల్సిందేనట. అంతేకాదు స్పోర్ట్స్ కార్ల విషయంలోనూ అదే ఇంట్రెస్ట్. అందుకే ఆయన వద్ద కలెక్షన్ బాగానే ఉంది.
కార్ల విషయానికి వస్తే, ఆయన వద్ద ఫెరారి ఎఫ్430 కారు ఉంది. టైమ్ దొరికితే ఈ కారులో షికారుకెళ్తుంటాడు చైతూ. దీని విలువ 1.71కోట్లు అట. అంటే రోల్స్ రాయ్స్ రేంజ్ రేట్ అని చెప్పొచ్చు.అలాగే మెర్సిడేజ్ బెజ్ జీ -క్లాస్ జీ 63 కారు కూడా ఉంది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుంది. చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఈ కార్స్ ఉపయోగిస్తుంటారు. ఇక చైతూకి బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా ఉంది. దీని వ్యాల్యూ కోటికి పైగానే ఉంటుంది. ఇది రెగ్యూలర్ ఫంక్షన్లు, ఈవెంట్లకి వాడుతుంటారు.
ఈ రెండింటితోపాటు ఎమ్‌వీ ఆగస్టా ఎఫ్ 4 అనే మరో కారు ఉంది. దీని విలువ సుమారు 35 లక్షల వరకు ఉంటుందట. చైతూ ఎక్కువగా ఈ కారులోనే షికారు కెళ్తారట. స్పోర్ట్స్ కారుగా దీన్ని తరచూ ఉపయోగిస్తుంటాడట.