రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “ది వారియర్” భారీ అంచనాల మధ్య థియేటర్ లోకి వచ్చింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఎనిమిదిన్నర కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో మిశ్రమ స్పందన ఎదురైంది. అయితే ఈ సినిమాపై గతంలో హీరో రామ్ స్పందించారు. అంతటి కఠిన సమయంలో కూడా థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడం గొప్ప విషయమని అన్నారు.
మొదట కరోనా తర్వాత రిలీజ్ ముందు వరకు ఏదో ఒక అడ్డంకి వస్తుందని, సినిమాను విడుదల చేయాలా వద్దా అని ఆలోచించారట. ఎన్నో అంచనాల మధ్య చివరికి సినిమా రిలీజ్ చేశారు. కానీ మూవీ విడుదలైన 6 రోజుకు కూడా దాదాపు 30 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ సినిమా బడ్జెట్ మరియు కాస్టింగ్ ఇతర పెట్టుబడుల కారణంగా ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లో ఈ మూవీ కూడా భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమాతో రామ్ పోతినేని తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు. ఈ మూవీని తమిళ్ లో లింగుస్వామి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మించారు.
రామ్ పోతినేని మరియు కృతి శెట్టి అద్భుత యాక్టింగ్ ఉన్నా కానీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయింది. ఇదిలా ఉండగా ఈ మూవీని ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారట. కానీ ఆయనకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ అయిందట. ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందనే టాక్ రావడంతో అల్లు అర్జున్ ఈ సినిమాను రిజెక్ట్ చేసి డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారు. లేదంటే ఆయన ఖాతాలో ఈ డిజాస్టర్ పడి ఉండేది.