రెండో పానిపట్టు యుద్ద సమయం… అక్బర్ V/s హేమూ ల మధ్య భీకర యుద్దం…. హేమూ ఢిల్లీ పాలకుడు అదిల్ షాకు ప్రధాని…అక్బర్ ఢిల్లీని గెలిచి తద్వారా ఆఖండ భారతాన్ని గెలవాలని ఉవ్విళ్లూరుతున్న యువరాజు..! మొఘల్ సేనకు హేమూ సేనలకు మధ్య యుద్దం స్టార్ట్ అయ్యింది. పానిపట్టు వద్ద తన ఏనుగు “హవాయి” మీద రణతంత్రం నడుపుతున్నాడు హేమూ…. హేమూ కు భయపడి… పానిపట్టుకు 12 కిలోమీటర్ల దూరంలో….500 మంది సైనికులను తన చుట్టూ రక్షణగా పెట్టుకొని ఉన్నాడు అక్బర్.!
రణక్షేత్రంలో అక్బర్ సంరక్షకుడు భైరంఖాన్ ఉన్నాడు… హేమూ తన చతురంగ బలగాలతో మొఘలు సేనలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.! అప్పటికే ఓటమి భయం వారిని ఆవహించింది. కానీ…అనుకోకుండా వచ్చిన ఓ బాణం హేమూ కుడికంట్లోకి దూసుకుపోయింది.! అంతే ఆ కంటినుండి రక్తం ధారలుగా కారుతోంది. అయినా ఆ కంటికి గుడ్డ కట్టుకొని ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నాడు హేమూ….. విపరీతంగా రక్తస్రావం కావడంతో..కళ్లు తిరిగిపడిపోయాడు హేమూ…అలా అపస్మారక స్థితిలో ఉన్న హేమూ ను అంతమొందించాడు భైరంఖాన్….అలా ఢిల్లీ సామ్రాజ్యం అక్బర్ చేతిలోకి వెళ్లింది.
హేమూ గురించి చాలామందికి తెలియని నిజాలు ఇవి.. హేమూ అసలు పేరు హేమచంద్ర… హర్యానా వాస్తవ్యుడు… నగరంలో…ఉప్పు అమ్ముకుంటూ తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు. వారానికోమారు జరిగే సంతలో…. సరుకులు తూచే ఉద్యోగం చేశాడు. మంచి పేరు సంపాధించి…ఆదిల్ షా ఆస్థానంలో ప్రధాని పదవిని చేపట్టాడు. హేమూ ఆజానుభవుడేం కాదు..సాధారణ ఎత్తు కలవాడు.. కత్తి విద్య రాదు, గుర్రపు స్వారీ రాదు, బాణం వేయడం కూడా రాదు..అయినా యుద్దంలో అతడుంటే చాలు…ఆ సైన్యానికి వేయ్యేనుగుల బలం.! ఏనుగు మీద కూర్చొని తంత్రం నడిపిస్తాడు. ఎలాంటి దాడి చేయాలి, ఎప్పుడు చేయాలి? ఎటువైపు నుండి చేయాలి? ప‌్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలి..? ఇలాంటి విషయాల్లో ఆరితేరిన వాడు. అందుకే…యుద్ద విద్యలేవీ రాకపోయినా…తెలివితో ప్రత్యర్థులను మట్టుబెట్టేవాడు. ! ఢిల్లీని నెల రోజులు పాలించిన ఏకైక భారతీయ రాజు ..హేమూనే.