క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం.ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు..క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా.. వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు, ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం పొగతాగడం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి.. పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి, అందుకు దోహదం చేసే కారకాలేంటి.. తదితర విషయాలు తెలుసుకోండి.
మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా… కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. సిగరెట్ త్రాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ కలుగుతుంది. మొదట్లో సిగరెట్ తాగటం వలన శరీరం, ఇతర భాగాలు తేలికగా, ప్రశాంతంగా మారతాయి. . సిగరెట్ కు అలవాటు పడిన కొన్ని రోజుల తరువాత, పరిగెత్తటం, మెట్లు ఎక్కటం వంటి కార్యాలను కూడా సరిగా నిర్వర్తించలేరు. కారణం సిగరెట్ ఉపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేయటం వలన.
సిగరెట్ ను ఎండబెట్టిన పొగాకు ఆకులతో తయారుచేస్తారు. అంతేకాకుండా రుచికోసం, ఆహ్లాదాన్ని కలిగించేందుకు అందులో కొన్ని రకాల రసాయనాలని కలుపుతారు. ఇందులో 7000 కన్నా ఎక్కువ మిశ్రమాలు కలుపబడతాయి, ఇందులో 60 కంటే ఎక్కువ మూలకాలు క్యాన్సర్’ని కలుగచేసేవే. ఇందులోని కొన్ని కారకాలు గుండె, ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను కలుగచేస్తాయి. కనుక మీరు పీల్చే ప్రతి గుటక మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పవచ్చు.
పొగ తాగడం తగ్గించటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. కానీ, అలవాటు పడిన తరువాత మానేయటం చాలా కష్టం. పొగ తాగటం మానేయటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ రావటానికి తక్కువ అవకాశాలున్పాయి. ఉపిరితిత్తులు మామూలు స్థితికి చేరుకోటానికి కొంత సమయం పడుతుంది. అనేక దేశాల్లో దీనిపై జరిపిన పరిశోధనల్లో పొగతాగడం మానేయటం వలన 70 శాతం క్యాన్సర్ నిరోధించినట్లేనని తెలిపారు. అధ్యయనాల ప్రకారం రోజులో 15 సిగరెట్లు తాగేవారు, ఇందులో సగం వరకు తగ్గించటం వలన వారి ఉపిరితిత్తులు కొంచెం వరకు అయినా పాడవకుండా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే పూర్తిగా మానేయలేని పక్షంలో కొంచెం వరకు అయిన పొగతాగడాన్ని తగ్గించడం చాలా మంచిది.
పొగతాగటం వలన క్యాన్సర్ వ్యాధికి మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులకు ఆస్కారమిస్తుంది. పొగతాగిన కాస్త సమయం మాత్రమే రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. పొగత్రాగటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. శ్వాస గొట్టం కూడా క్యాన్సర్ కి గురవుతుంది. జీర్ణాశయ క్యాన్సర్ కలుగుతుంది. అల్సర్ లు, రోగనిరోధక శక్తిలో తగ్గుదల, రక్తంలో చెక్కెర స్థాయిల పెరుగుదల, రక్త పీడనం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.