భారతీయులు పురాతన కాలం నుంచి వాడుతున్న అనేక వంట ఇంటి పోపు దినుసుల్లో ధనియాలు కూడా ఒకటి. కొందరు వీటిని మసాలాల్లో ఉపయోగిస్తారు. కొందరు వీటిని నేరుగా పోపులోనే వేస్తారు. అయితే కేవలం వంట ఇంటి దినుసుగానే కాదు, ధనియాలు మనకు అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఆయుర్వేద ప్రకారం.. ధనియాలకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. మరి ధనియాలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. ధనియాల కషాయం చేసుకుని తాగితే గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది.
ధనియాల పొడిని ఆహారంలో వాడితే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే శరీరంలో ఏ అవయవంలో నొప్పి ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారు నిత్యం ధనియాలను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. ధనియాల కషాయంతోనూ బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం, విరేచనాలు సమస్యలతో బాధపడేవారు ధనియాల కషాయం తాగాలి. దీంతో జీర్ణాశయంలో ఉన్న క్రిములు, ఏలికపాములు కూడా నశిస్తాయి.
టైఫాయిడ్ జ్వరం వచ్చిన వారు ధనియాల కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది. పసుపులో ధనియాల పొడి కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ధనియాల కషాయాన్ని తాగితే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ధనియాల పొడిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.