లావుగా ఉన్నారా? అజీర్తి సమస్యా? మైండ్ అండ్ బాడీ బద్దకంగా ఉందా? మలబద్దకం వేధిస్తుందా? అయితే ఇలాంటి ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఔషధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే చాలు మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి.
కావల్సిన పదార్థాలు:
మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, నల్ల జీలకర్ర- 50 గ్రాములు.
తయారీ విధానం:
పై మూడు పదార్థాలను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి, తర్వాత ఈ మూడింటిని మిక్సీలో పట్టాలి. అలా వచ్చిన పొడిని గాలి దూరని సీసాలో నిల్వ చేయాలి.
వాడే విధానం..
ప్రతి రోజూ…రాత్రి భోజనం తర్వాత….గోరువెచ్చని నీటిలో…ఓ చెంచా ఈ పొడిని కలిపి తాగాలి, దీనిని తాగిన తర్వాత ఇతర ఏ పదార్థాలను తినకూడదు.
దీని వలన ఉపయోగాలు..
శరీరంలోని అన్ని రకాల వ్యర్థాలను మల, మూత్ర, చెమట ద్వారా బయటికి పంపేస్తుంది. అధిక బరువును క్రమంగా తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఎముకలు, కండరాలను, కీళ్ళను బలపరుస్తుంది. కంటిచూపు, జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. జ్ఙాపక శక్తి , వినికిడి శక్తి పెరుగుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
గమనిక: 3 నెలల పాటు ఈ చూర్ణాన్ని వాడిన తర్వాత రెండో విడత మొదలు పెట్టేముందు ఓ 15 రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి.