ఎంత కష్టపడ్డా..రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాాయా? సంపాదించింది మొత్తం మన చేతికి రాకుండా పోతుందా? అయితే మేము చెప్పిన ఓ వారం రోజులు చేస్తే చాలు….మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్దిస్తాయి . ఇది పూరాతాన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం. తప్పనిసరిగా నమ్మాలని ఏం లేదు…నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.
ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే.
దీపావళికి సరిగ్గా 44 రోజుల ముందు ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి…మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి…నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి. విష్ణు, మహాలక్ష్మిల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇలా చేసి చూడండి…మీ సంపాదన లో స్థిరత్వం రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.