హిందువులు ఆవును దైవంగా భావించి పూజిస్తారన్న సంగతి తెలిసిందే. ఆవులో సకల దేవతలు ఉంటారని వారి నమ్మకం. అందుకే వారు ఆవును దైవంగా భావించి కొలుస్తారు. ఈ క్రమంలోనే ఆవు మూత్రానికి కూడా ఎంతో విలువ ఇస్తారు. దాన్ని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇప్పుడిప్పుడే ఈ విషయంపై అనేక మంది సైంటిస్టులు ప్రయోగాలు కూడా చేసి ఆవు మూత్రం ఉపయోగాలను నిరూపిస్తున్నారు కూడా. దాని వల్ల ఎలాంటి రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు మూత్రంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తాయి. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి ఆవు మూత్రానికి ఉంది.
వాత, పిత్త, కఫాల్లో వచ్చే అసమతుల్యత వల్లే మనకు అనేక రకాల రోగాలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మూడు దోషాలను సమతుల్యం చేసే శక్తి ఆవు మూత్రానికి ఉందట. దీంతో అనేక రకాల రోగాలు నయమవుతాయి. కాలేయం శుభ్రమవుతుంది. అందులో ఉన్న వ్యర్థ, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఆవు మూత్రంలో పొటాషియం, కాల్షియం, యూరియా, క్లోరైడ్, అమ్మోనియా వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. వాటి వల్ల ఒంట్లో ఉన్న అనారోగ్యాలు నశిస్తాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు.
ఆవు మూత్రం సేవిస్తే చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మొటిమలు, మచ్చలు వంటివి పోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు మాయమవుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి పోతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు నాశనమవుతాయి. అధిక బరువును తగ్గించే గుణాలు ఆవు మూత్రంలో ఉన్నాయి. నిత్యం ఆవు మూత్రం సేవిస్తే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. సాధారణ ఆవు మూత్రం కన్నా గర్భంతో ఉన్న ఆవు మూత్రం తాగితే ఇంకా మంచిదట. దాని వల్ల కలిగే ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
చాలా మంది ఆవు మూత్రాన్ని డైరెక్ట్‌గా అలాగే పట్టుకుని తాగుతారు. అలా తాగలేని వారు ముందుగా రోజుకు 2, 3 చుక్కలు స్పూన్‌లో వేసుకుని తాగడం మొదలు పెట్టాలి. క్రమంగా ఒక స్పూన్ తాగాలి. అలా పరిమాణం పెంచుతూ రోజుకు కనీసం 30 ఎంఎల్ మోతాదులోనైనా తాగాలి. దీంతో పైన చెప్పిన విధంగా అనేక లాభాలు కలుగుతాయి.