దగ్గు వస్తుందంటే చాలు.. ఎవరైనా మొదటగా డాక్టర్ వద్దకు వెళ్లరు. మందుల షాపుకే వెళ్తారు. అక్కడ దగ్గు మందు కొని తాగుతారు. దీంతో సమస్య పోతుంది. తరువాత మళ్లీ ఎప్పుడైనా దగ్గు సమస్య వస్తే మళ్లీ అలాగే చేస్తారు. అంతేకానీ డాక్టర్ వద్దకు మాత్రం వెళ్లరు. తమ సొంత వైద్యం చేసుకుంటారు. అయితే పెద్దలే కాదు, వారు తమ పిల్లలకు కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదట. ఆ మాట కొస్తే అసలు డాక్టర్లు కూడా దగ్గు వస్తే టానిక్‌ను రాయకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే మరి దగ్గు మందు తాగక పోతే ఎలా ? కనీసం డాక్టర్ రాసిచ్చినా తాగడానికి వీలు లేదా ? ఎందుకు ? అంటే.. అందుకు వైద్య నిపుణులు చెబుతున్నది ఇదే..!
సాధారణంగా దగ్గు ఎలా వస్తుంది ? మనం పీల్చే గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు, దుమ్ము మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇది లోపల ఇమడ లేదు. కనుక శరీరం వీటిని బయటకు పంపుతుంది. దగ్గు రూపంలో ఇవి మళ్లీ బయటకు వస్తాయి. దీని వల్లే మనకు దగ్గు వస్తుంది. ఈ క్రమంలో మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, దుమ్ము బయటకు పోతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
కానీ దగ్గు వచ్చింది కదా అని చెప్పి దగ్గు మందు తాగితే ఆ క్రిములు, పొల్యూషన్ అంతా లోపలే ఉంటుంది. బయటకు వెళ్లవు. దీంతో అవి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అనారోగ్యం తీవ్రత పెరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక దగ్గు వస్తే వేచి ఉండి దగ్గు దగ్గాలి కానీ దగ్గు మందు తాగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు విదేశాల్లో దగ్గు మందును నిషేధించారని, కానీ మన దేశంలో మాత్రం దగ్గు మందులను ఇంకా విక్రయిస్తూనే ఉన్నారని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇకపై దగ్గు వస్తే తగ్గేదాకా వేచి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ దాని కోసం టానిక్ తాగవద్దని సూచిస్తున్నారు. కనుక ఈ విషయం పట్ల ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి..!