Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? మరి చెవులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి!

Admin by Admin
February 18, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ నువాడుతున్నారా… కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట …కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబందిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి…..మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి వినబడకుండా పోవడమో, ఇన్‌ఫెక్షన్లు రావడమో, ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది..

కాటన్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి, ఇయర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో వినికిడి సమస్యలు వస్తాయి. చెవుల్లో గులిమి ఏర్పడడం సహజసిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు. గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది.

how to clean ears without using cotton buds

చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది. అంతేకానీ దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్‌ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు. కాటన్ బడ్స్ తో కాకుండా గులిమిని క్లీన్ చేసుకోవడం ఎలా ? కొంత మందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది. అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే 1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1/2 కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి. అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పై వైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది.

తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వస్తాయి. అనంతరం చెవులను నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్‌, మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వాటి వలన మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి.. లేదంటే సాల్ట్‌ వాటరే బెటర్‌.

Tags: Cotton BudsEar Cleaning
Previous Post

కొవ్వును క‌రిగించే హార్మోన్ల‌ను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి..!

Next Post

మీ ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా రావ‌డం లేదా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.