జీవితం ఎంత వేగంగా పరుగెడుతుంది … అంటే అది వారు పరిగెత్తడంపైనే ఉంటుంది. మెట్రో నగరాలలో పరుగు మరింత వేగం! ఈ పరుగంతా కొద్దిపాటి సంపాదనకు, జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించటానికి. ఈ పరుగులోపడి ఫిట్ నెస్ కు అవసరమైన రోజువారీ వ్యాయామాలు సైతం మరచిపోతాం. ఆఫీస్ కు లేదా పనికి వేళకే చేరతాము. అయితే, ఒక్క అరగంట కేటాయించి ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామాలను అశ్రధ్ధ చేస్తాం. అరగంట రోజూ వ్యాయామానికి కేటాయించడం అంటే, కష్టమే! కాని శరీరాన్ని వ్యాధులబారినుండి రక్షించుకొని అవసరమైన వ్యాధినిరోధక శక్తి కొరకు ఈ మాత్రం కేటాయింపు తప్పదు.
ఇక బయటకు వస్తే కూల్ డ్రింకులు, బిస్కట్లు, బేకరీ ఐటమ్, ఫాస్ట్ ఫుడ్ లు తింటూనే వుంటాం. వీటన్నిటికి గుడ్ బై చెప్పి వాటికి పెట్టే డబ్బు పండ్లు, సలాడ్ లు, సూప్ లు మొదలగు ఆరోగ్యకర తిండి పదార్ధాలపై పెడితే శరీరానికి మంచిది. మంచి ఆకలి కూడా వేస్తుంది. ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా తేలికగాతయారు చేసేదిగాను ఆరోగ్యకరమైనదిగాను వుండాలి. దానికిగాను కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ మొదలైనవి సూచించవచ్చు. మన బిజీ జీవితాల్లో కూడా ఒత్తిడి తగ్గించుకోడానికి, కొద్దిపాటి ఆనందానికి మ్యూజిక్ వినడం ఎంతో మంచిది. ఇక పనిభారం మాటకి వస్తే పాజిటివ్ ఆలోచన మంచిది. కొన్ని పనులు ఒకో సమయంలో విసుగనిపిస్తాయి. వాటిని ఆసక్తికరంగా మలుచుకొని కొత్త విధంగా చేస్తూవుంటే మీకు ఎంతో శక్తినిస్తాయి.
వారమంతా బిజీగా గడిపేసినా, వారాంతపు సెలవులను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు కేటాయించండి. సాధారణంగా వీరిని పని రోజుల్లో దూరంగా వుంచాతాం. లేట్ నైట్ పార్టీలు మానండి. ఆనందాన్నిచ్చే ఆటపాటలతో కాలక్షేపం చేయండి. ఫలితాలు అధ్భుతంగా వుంటాయి. జీవితంలో మొదటి రూలు – మనం ఏది చేసినా అది సంతోషాన్నిచ్చేది అయివుండాలి. అపుడు చేసే పని మీకవసరమైన ఎనర్జీనిస్తుంది. లైఫ్ ఎంత బిజీ అయినప్పటికి అవసరమైన ఇతర పనులు కూడా చేసుకుంటే మెచ్చుకోదగినదే. బిజీ లైఫ్ లో కూడా కొంచెం తేలిక పడటం జరుగుతుంది.