2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు. కానీఆ ఏడాది దాటి కూడా చాలా ఏళ్లపోయింది. అయినప్పటికీ ప్రపంచం అంతం కాలేదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి ఇలాంటి పుకార్లు మళ్లీ ఎక్కువైపోయాయి. ప్రపంచం కొద్ది రోజుల్లో అంతం అవుతుందని అడపా దడపా చాలా మంది చెబుతున్నారు. కానీ అవేవీ నిజం కావడం లేదు. ఇక తాజాగా ఓ వ్యక్తి తాను టైమ్ ట్రావెల్ చేశానని, కాలంలో ప్రయాణించి వచ్చానని, 2025లో పలు ప్రకృతి విపత్తులు సంభవించి ప్రపంచం అంతమై పోతుందని చెబుతున్నాడు. ఇంతకీ అతను ఎవరు, ఏం చెబుతున్నాడు.. అంటే..
అమెరికాకు చెందిన ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. తాను కాలంలో ప్రయాణం చేసి వచ్చానని అన్నాడు. 2025లో పలు ఉత్పాతాలు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాడు. 24 కిలోమీటర్ల వ్యాసం కలిగిన భారీ టోర్నడో ఒకటి గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏప్రిల్ 6వ తేదీన అమెరికాలోని ఓక్లహామాను చుట్టు ముట్టి అందరినీ సర్వనాశనం చేస్తుందని చెప్పడు. అలాగే మే 27వ తేదీన అమెరికా సివిల్ వార్ మొదలవుతుందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా అందరూ అణ్వాయుధాలను ఉపయోగిస్తారని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పాడు.
సెప్టెంబర్ 1వ తేదీన చాంపియన్ అనే పేరున్న ఒక ఏలియన్ వచ్చి 12వేల మంది మనుషులను సురక్షితంగా ఇంకో గ్రహానికి తీసుకెళ్తుందని చెప్పాడు. సెప్టెంబర్ 19వ తేదీన అమెరికా తీర ప్రాంతంలో భారీ తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోతుందని, నవంబర్ 3న నీలి తిమింగలం కన్నా 6 రెట్లు పెద్దదిగా ఉండే ఒక జీవి పసిఫిక్ మహా సముద్రం నుంచి పుట్టుకు వస్తుందని, దాని పేరు సెరీన్ క్రౌన్ అని చెప్పాడు. దీంతో భూమి అంతం అవుతుందని అన్నాడు. అయితే ఎల్విస్ చెబుతున్న మాటలను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. అతని వీడియోను సేవ్ చేసుకున్నామని, అతను చెప్పినవి జరగకపోతే లీగల్‌గా అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు అతను చెప్పినవన్నీ నిజమే అయి ఉండవచ్చని అంటున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.