రాను రాను పెట్రోల్ ధర కొండెక్కుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దీని రేటు పెరుగుతూనే ఉంది. కానీ తగ్గడం లేదు. ఒక వేళ తగ్గినా మళ్లీ పెట్రోల్ రేటును పెంచుతున్నారు. దీంతో పెరిగిన రేట్లతో జనాలు వాహనాలను నడపలేకపోతున్నారు. అయితే పెట్రోల్‌ను రూ.22కే అందిస్తామని గతంలోనే ప్రకటించారు. అప్పట్లో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మరో తరహా ఇంధనాన్ని అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. దాని పేరు మిథనాల్. దీంతో ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో మరోసారి మిథనాల్ తెర మీదకు వచ్చింది. దీన్ని కేవలం రూ.22 కే లీటర్ అందించాలని మళ్లీ కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం గతంలోనే మిథనాల్ పాలసీని ప్రకటించింది. దీని వల్ల బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని 15 శాతం మోతాదులో పెట్రోల్‌లో కలుపుతారు. దీంతో మిథనాల్ ఇంధనం తయారవుతుంది. ఇక ఇలా తయారైన ఇంధనం ధర లీటర్‌కు రూ.22 మాత్రమే అవుతుంది. చైనాలో రూ.17కే ఈ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. దీంతో మన దేశంలో కూడా ఇలా మిథనాల్‌ను తయారు చేసి అందిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఏమైందో తెలియదు. కానీ పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం ప్రజలను ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి.
మన దేశంలో దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా ముంబై చుట్టు పక్కల ఉన్న చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే స్వీడన్ ఆటో మేజర్ వోల్వో కంపెనీ మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజిన్‌ను కూడా రూపొందించింది. దీంతో వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు గతంలోనే ప్రణాళికలు రచించారు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఈ విషయం మరుగున పడిపోయింది. ఇప్పటికైనా మిథనాల్‌ను అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుతున్నారు.