పొట్ట కొవ్వు తగ్గించాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మంచి పరిష్కారంగా ఒక తాజా అధ్యయనం సూచించింది. కొవ్వు పొట్టలోకి చొచ్చుకొనిపోయి అంతర్గత అవయవాల మధ్య జాగాల్లో పేరుకుంటుంది. ఫలితంగా, గుండెజబ్బులు, డయాబెటీస్, కేన్సర్ వ్యాధులు వస్తాయి. కొవ్వు ఎంత వున్నదనే దానికంటే కూడా అది ఎక్కడ పేరుకున్నదనేది ముఖ్యం అంటారు అధ్యయన కర్త డ్యూక్.
ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ పొట్ట కొవ్వును కరిగించేయాలంటే ఏరోబిక్ ఎక్స ర్ సైజెస్ క్రమం తప్పకుండా చేయటమే మంచి మందని, దీని వలన అధిక కేలరీలు ఖర్చు చేయబడతాయని చెపుతున్నారు.
ఇతర వ్యాయామాలకంటే కూడా ఏరోబిక్ వ్యాయామాలు 67 శాతం అధిక కేలరీలను వ్యయం చేస్తాయి. ఈ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం లో ప్రచురించారు.