టాలీవుడ్ లో నటీనటులకు కొరతే లేదు. అయితే కొందరు నటీమణులు కొన్ని సినిమాలే చేసినప్పటికీ ఓ రేంజ్ లో గుర్తింపుని తెచ్చుకుంటారు. కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఒక చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించి గుర్తింపు రాక వెళ్లిన వారు కొంతమంది ఉన్నారు. అలా వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్లంతా సడన్ గా కనిపించకుండా పోయారు. ఇలా తెరమరుగైన అందాల తారలు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.. రక్షిత.. నిజం, ఇడియట్, శివమణి చిత్రాలలో నటించిన రక్షిత అప్పట్లో హాట్ బ్యూటీ. పెళ్లి తర్వాత రక్షిత అభిమానులకు దూరంగా ఉంటున్నారు.
కమలిని ముఖర్జీ. ఆనంద్, గోదావరి, గమ్యం చిత్రాలలో మెరిసిన కమలిని ముఖర్జీ కూడా ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటుంది. గజాల. అల్లరి రాముడు, స్టూడెంట్ నెంబర్ 1, తొట్టి గ్యాంగ్, జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రాలలో మెరిసిన గజాల కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం గజాల వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. రంభ. 90వ దశకంలో ఒక ఊపు ఊపిన రంభ ఆ తర్వాత కూడా దేశముదురు, యమదొంగ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రంభ కూడా వెండితెరకు దూరంగా ఉంటుంది.
అన్షు. మన్మధుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలలో మెరిసిన అన్షు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పెళ్లి తరువాత వెండితెరకు దూరంగా ఉంటుంది. రీమాసేన్. చిత్రం, మనసంతా నువ్వే, యుగానికి ఒక్కడు, బంగారం ఇలాంటి చిత్రాలతో రీమాసేన్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రీమాసేన్ వెండితెరకు దూరంగా ఉంటుంది. సోనియా దీప్తి. హ్యాపీడేస్, వినాయకుడు, దూకుడు చిత్రాలలో నటించిన సోనియా దీప్తి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. గోపిక. నా ఆటోగ్రాఫ్, లేత మనసులు, యువసేన వంటి చిత్రాలలో నటించిన గోపిక తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తు. కానీ ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అషీమా భల్లా. ధర్మ, చెప్పవే చిరుగాలి చిత్రాలతో మెరిసిన అషీమా సడన్ గా తెలుగు సినిమాలకు దూరమైంది.