ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే కాంతారా మూవీ మాత్రం ముందుగా కన్నడ భాషలో రిలీజ్ చేశారు. ఇది అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 250 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే సినిమా కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
కన్నడ భాషలోనే కాకుండా అన్ని భాషల్లో వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా మరియు డైరెక్టర్ గా నటించారు. ఇందులో సంయుక్త గౌడ్ హీరోయిన్ గా చేశారు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో కేవలం 16 కోట్లతోనే పూర్తి చేశారు. కానీ సినిమా పెట్టిన దానికి ఎన్నో రెట్లు సంపాదించింది. అలాంటి ఈ చిత్రంలో నటించిన చాలామంది నటీనటులు రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారట. అదేవిధంగా నటి సంయుక్త గౌడ్1.25 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించిన కిషోర్ కోటి రూపాయలు, నెగిటివ్ పాత్రలో నటించిన అచ్యుత్ కుమార్ 75 లక్షలు తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత తక్కువ పారితోషకంతో, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్లు రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.