టైప్ 2 డయాబెటీస్ కు రక్తపోటుకు సంబంధం వుందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. షుగర్ నియంత్రణ అంత ప్రధానం కాదుగానీ, రక్తపోటును కూడా 130/80 వుండేలా నియంత్రించాల్సిందే. ఏదైనా ఒక మందుతో తగ్గకపోతే మరోకటి వాడి అయినా సరే దానిని నియంత్రించాలి. రక్తపోటును ఎట్టి పరిస్ధితిలోను నియంత్రించాల్సిందే నని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
కొల్లెస్ట్రాల్ ఎలా నియంత్రించాలి? కొల్లెస్ట్రాల్ రక్తంలో కొవ్వుగా వుంటుంది డయాబెటీస్ వుంటే కొల్లెస్ట్రాల్ 50 శాతం వరకు వుండే అవకాశాలున్నాయి. దీనిని కూడా నియంత్రించాల్సిందే. మొదటగా మీరు దీనిని నియంత్రించాలంటే ఆహారనియంత్రణ, వ్యాయామలు చేయాలి. అధికబరువున్నట్లయితే, బరువు తగ్గించుకుంటే కొల్లెస్ట్రాల్ తగ్గుతుంది.
మరీ ఎక్కువగా వుంటే కొల్లెస్ట్రాల్ కు మందులు వాడాల్సిందే. కొల్లెస్ట్రాల్ లో మంచి, చెడు అని రెండు రకాలుంటాయి. ఒక్కసారి పరీక్షా నిర్ధారణ చేస్తే, మంచి కొల్లెస్ట్రాల్ ఎంత? చెడు కొల్లెస్ట్రాల్ ఎంత అనేది తెలుస్తుంది. వైద్యుడి సలహా మేరకు మందులు తప్పక వాడాలి.