సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా, అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది. సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే సెలబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారనుకుంటే, ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు బుల్లితెర సెలబ్రిటీస్ వయస్సు 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఎంచక్కా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ 40 దాటినా పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సల్మాన్ ఖాన్.. ఇండియా సినిమాలోనే సింగిల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సల్లూ భాయ్. సల్లూ భాయ్ అన్ని సింగిల్స్ సంఘం అధికారిక నాయకుడు. ఆర్. నారాయణ మూర్తి.. మరో ఎవర్ గ్రీన్ సింగిల్ సూపర్ స్టార్ మన నారాయణ మూర్తి. ప్రభాస్.. ఏ సినిమా ప్రమోషన్ కి ప్రభాస్ వచ్చినా.. పెళ్లి ఎప్పుడు పెళ్లి, ఎప్పుడు అని రిపీట్ గా క్వశ్చన్స్ వస్తాయ్. ప్రభాస్ బేసిక్ గా సిగ్గు పడుతూ ప్రశాంతంగా ఉంటాడు, ఇంత వరకు పెళ్లిపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
త్రిష.. త్రిష కూడా సింగిల్ లైఫ్ నే కొనసాగిస్తుంది. సరైన వ్యక్తి కోసం ఆమె వేచి చూస్తున్నారేమో అని అనుకుంటున్నారు. మరి మన స్వీటీ అనుష్క శెట్టి కూడా సోలో బతుకే బెటర్ అంటూ లైఫ్ లో ముందుకు దూసుకు పోతుంది. సుబ్బరాజు కూడా పెళ్లికి నో అని చెప్పేశారు. TNR ఇంటర్వ్యూ లో పెళ్లి మీద ప్రశ్న కి ఒక మంచి సెన్సిబుల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. పెద్దలు అలిగారు అని పెళ్లి చేసుకోకూడదన్నారు. అందాల దేవత టబు కూడా హ్యాపీ & హెల్తీగా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.