వంకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయలతో చాలా రకాల వంటకాలను తయారుచేసి తింటుంటారు. వాటిల్లో గుత్తి వంకాయ కూర కూడా ఒకటి. దీన్ని బిర్యానీ రైస్‌తో తింటే సూపర్‌గా ఉంటుంది. శుభ కార్యాల సమయంలో గుత్తి వంకాయను ఎక్కువగా వండుతారు. అయితే కాస్త శ్రమించాలే కానీ ఇలాంటి రుచితో ఇంట్లోనే గుత్తి వంకాయ కూరను ఎంతో సులభంగా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేయాలో దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు..
తాజా వంకాయలు… ½ కిలో, ఆవాలు… 1/2 టీస్పూన్, ఉప్పు… 2 టీస్పూన్లు, అల్లం… 2 ముక్కలు, నూనె… 2 టీస్పూన్లు, పచ్చి మిర్చి… 10.
తయారీ విధానం..
ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలిగుత్తుగా . లేత వంకాయలను చివర విడిపోకుండా, నాలుగు భాగాలుగా కోసి, అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. స్టౌ మీద బాణెలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇందులో గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి . ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి. అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి.