రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. వచ్చే ట్రైను వెళ్లే ట్రైను నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య చూసి రైల్వే శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విపరీతమైన రద్దీ దృష్ట్యా ప్రయాణికుల క్షేమం చూసి ఈ ప్లాట్ పారం టిక్కెట్లు పెట్టారు. చాలామంది సంబంధంలేని వారు కూడా వస్తూ ఉంటారు షికారుగా. వారు ఎక్కువ అయిపోతే ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.
చాలామంది సరదాగా వచ్చి ప్లాట్ఫారం మీద తిరుగుతూ ఉంటారు. ఇది నివారించడానికి రైల్వే ప్లాట్ఫారం టిక్కట్టు పెట్టారు. దానివల్ల రైల్వే కి కొంత ఆదాయం వస్తుంది అనవసర వ్యక్తులు ప్లాట్ఫారం మీద రాకుండా ఉండటానికి దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఏర్పాటు చేశారు.
టికెట్ ఉన్నవాళ్లు ఎలాగా ఆధారం ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఈ అనవసరంగా సరదాగా తిరిగే మనుషులు ఉంటారు వాళ్ళని కట్టడి చేయటానికి ఇది. ఈ టిక్కెట్ కూడా రోజంతా ఉండదు గంటా రెండు గంటల వరకే ఉంటుంది. టికెట్టు తీసుకున్న టైం నుండి రెండు గంటల లోపు వాళ్లు వెళ్లిపోవాలి. లేకపోతే ఇంకొక టికట్టు తీసుకోవాల్సి వస్తుంది.