యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలో యాడ్స్ చాలా పెరిగాయనే చెప్పవచ్చు. యూట్యూబ్ ఓనర్ అయిన గూగుల్ కేవలం డబ్బే పరమావధిగా పనిచేస్తుంది కనుక యూజర్లకు అసౌకర్యం కలిగినా సరే ఎడా పెడా యాడ్స్‌ను వీడియోలపై ప్రదర్శిస్తూనే ఉంది. అయితే యూట్యూబ్‌లో ప్రీమియం అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అందులో నెలవారిగా లేదా ఏడాది వారిగా కొన్ని ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాస్త పైకం చెల్లిస్తే యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలను చూడవచ్చు. కానీ డబ్బులు కట్టాలంటే అందరి వద్ద ఉండాలి కదా. కనుక చాలా మంది డబ్బులు లేకుండానే యూట్యూబ్‌ను చూస్తుంటారు. వీడియోలపై వచ్చే యాడ్స్‌కు ఇబ్బందులు పడుతూనే ఉంటారు.
అయితే యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూడలేమా.. అంటే.. యెస్.. చూడవచ్చు. అందుకు పలు మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో యాడ్స్ రావొద్దంటే మీరు ఏ ప్లాట్ ఫామ్‌లో అయినా సరే బ్రేవ్ అనే బ్రౌజర్‌ను ఉపయోగించండి. ఇది యాప్ రూపంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్‌లపై అందుబాటులో ఉంది. పీసీల్లో అయితే సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రౌజర్లో గనక మీరు యూట్యూబ్ వీడియోలను చూసినట్లయితే యాడ్స్ రావు.
ఇక మీరు క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్లను వాడితే వాటిల్లో యాడ్ బ్లాకర్ సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని ఆన్ చేస్తే చాలు.. యూట్యూబ్‌లో మీకు వీడియోలపై యాడ్స్ రావు. అలాగే వీఎల్సీ మీడియా ప్లేయర్‌ను మీరు యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. దీని ద్వారా కూడా యాడ్స్ రాకుండా వీడియోలను చూడవచ్చు. అయితే క్రియేటర్లు చాలా కష్టపడి వీడియోలను పెడతారు కనుక మీరు వారికి సపోర్ట్ చేయదలిస్తే యాడ్స్‌తో ఉండే వీడియోలనే చూడండి.