Food Order : నూతన సంవత్సరంలో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్‌ల నుంచి ఫుడ్‌ను ఆర్డర్ చేసే కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జనవరి 1వ తేదీ నుంచి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆర్డర్ చేసే ఫుడ్‌కు 5 శాతం జీఎస్‌టీని కస్టమర్ల నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఆమేర ఫుడ్ చార్జిలు పెరగనున్నాయి. ఈ క్రమంలోనే జనవరి నుంచి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆర్డర్ చేసే ఫుడ్‌కు అదనంగా 5 శాతం జీఎస్‌టీ విధించి వసూలు చేయనున్నారు. దీంతో ధరలు పెరగనున్నాయి.
ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే 5 శాతం జీఎస్‌టీని కస్టమర్ల నుంచి వసూలు చేయాలనే నిర్ణయాన్ని గత సెప్టెంబర్ నెలలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే జనవరి 1, 2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఫుడ్ డెలివరీ యాప్‌లు ఇకపై రెస్టారెంట్ల నుంచి కాకుండా కస్టమర్ల నుంచి 5 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తాయి. దీని వల్ల రిజిస్టర్ కాబడని రెస్టారెంట్లను కూడా జీఎస్‌టీ కిందకు తేవొచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే కస్టమర్లపై దీని వల్ల అదనపు భారం పడదని, పాత ప్రకారమే చార్జిలను చెల్లిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. కానీ ఫుడ్ డెలివరీ యాప్‌లు ట్యాక్స్‌ను వసూలు చేయాలని నిర్ణయిస్తే మాత్రం కస్టమర్లపై అదనపు భారం పడుతుంది. దీంతో ఫుడ్ మరింత ప్రియం కానుంది.
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి జీఎస్‌టీని వసూలు చేస్తూ వచ్చాయి. అయితే కొత్తగా అమలు చేయనున్న విధానాల ప్రకారం.. ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా రెస్టారెంట్ల కోవకు చెందుతాయి. కనుక 5 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తామని కేంద్రం చెబుతోంది. మరి జనవరి 1 నుంచి ఏం జరుగుతుందో చూడాలి.