ప్రేమ, పెళ్లి.. ఎవరూ ఊహించనిది. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వింటూనే ఉంటాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్. అయితే రాజకీయ నేతలు, సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం. 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది. వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఓ రాజకీయ నేత మాత్రం అమెను సినిమాలో చూసి ఆరాధించడం మొదలు పెట్టాడు. ఆరాధన కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారు రహస్యంగా పెళ్లి చేసుకునేలా చేసింది. వారిద్దరి మధ్య 20ఏళ్ల తేడా ఉంది. నిజానికి తాను 2006లోనే జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిని పెళ్లాడినట్లు ఓ ఇంటర్వ్యూలో రాధిక స్వయంగా వెల్లడించింది.
ఎవరీ జంట అని ఆశ్చర్యపోతున్నారా.. వారే మాజీం సీఎం కుమార స్వామి, హీరోయిన్ రాధిక. 2006 సంవత్సరంలో ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దీంతో అటూ సినీ పరిశ్రమలో, ఇటూ రాజకీయాల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. దీంతో కుమారస్వామి రాజకీయ జీవితం కంటే ఆయన వ్యక్తిగత జీవితంపైనే జనాలు ఆసక్తి చూపేవారు. రాధిక 2002లో కన్నడ చిత్రం నీలా మేఘా శామతో వెలుగులోకి వచ్చింది. ఆమె మొదటి సినిమా కన్నడలో వచ్చిన నీనాగాగి. రాధిక మొదటి సినిమా అరంగేట్రం చేసే సమయానికి 9వ తరగతి చదువుతుండగా.. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు మాత్రమే. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. నటిగా ప్రస్థానం మొదలు పెట్టిన రాధికా.. ఆ తర్వాత నిర్మాతగా మారింది. 2012 సంవత్సరంలో తన మొదటి కన్నడ చిత్రం లక్కీని కూడా నిర్మించింది.
తెలుగులో రాధికా రెండు చిత్రాల్లో నటించింది. నందమూరి తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడులో ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అవతారం అంటూ ఓ భక్తరస చిత్రంలో నటించింది. మీడియా నివేదికల ప్రకారం, వివాహ సమయంలో హెచ్‌డి కుమారస్వామి వయస్సు 47 కాగా, రాధిక అతని కంటే 27 సంవత్సరాలు చిన్నది. కాగా కుమారస్వామికి ఇది రెండో వివాహం. అతని మొదటి వివాహం 1986 సంవత్సరంలో జరిగింది. నివేదికల ప్రకారం, ఇది రాధికకు రెండవ వివాహం కూడా. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, అయితే ఈ వివాహం త్వరగా విడిపోయింది.
డబ్బు కోసమే కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. మీడియా కథనాల ప్రకారం ఆస్తుల వివరాలు ఇలా.. రాధిక ఆస్తులు రూ.124 కోట్లు, కుమారస్వామి ఆస్తులు రూ.44 కోట్లు. దీంట్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కుమారస్వామికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి అస్సలు ఇష్టం లేదంట. అయితే రాధిక అతడిని ఎదిరించి పెళ్లి చేసుకుందని సినీ ఇండస్ట్రీలో టాక్. దీంతో వారిద్దరూ తమ వివాహాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఈ ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.