విజయవాడ నుండి హైద్రాబాద్ కు 272 కిలోమీటర్ల దూరం..అలాగే వివిధ ప్రాంతాల నుండి హైద్రాబాద్ ఎన్నో కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది.! ఇంత వరకు ఓకే..! కానీ హైద్రాబాద్ కు దూరం అంటే… హైద్రాబాద్ లోని LB నగర్ వరకు దూరమా..? MGBS వరకు ఉండే దూరమా..? KPHB వరకు ఉండే డిస్టెన్సా..? అనేదే అసలు డౌట్.! హైద్రాబాద్ యే..ఎటునుండి చూసినా దాదాపు 100కిలోమీటర్లు మేరకు ఉంటుంది కదా.!
హైద్రాబాద్ లోని అసెంబ్లీ వద్ద జీరో మైల్ స్టోన్ ఉంటుంది. ఇది హైద్రాబాద్ డిస్టెన్స్ ను కొలవడానికి కేంద్ర బిందువు. ఇక్కడి నుండి జీరో తో కౌంట్ స్టార్ట్ అవుతుంది. అది విజయవాడ అయినా… వైజాగ్ అయినా..తిరుపతి అయినా…కొలత ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది.!ఇలా ప్రతి ముఖ్య పట్టణానికి ఓ జీరో మైల్ స్టోన్ ఉంటుంది.
అదే విధంగా ఇండియాకు కూడా ఓ జీరో మైల్ స్టోన్ ఉంది. అది నాగ్ పూర్ లో ఉంది. బ్రిటీషర్స్ 1907 లో దానిని ఏర్పాటు చేశారు.! ఇక్కడి నుండే దేశ విదేశాలకు ఇండియాకు మద్య దూరాన్ని కొలుస్తారు.!