మనం సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కోసం బంకుకీ వెళ్ళినపుడు బండిలో పెట్రోల్ కొట్టించాక డబ్బు పే చేసి వెళ్తుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో మనకు ఫ్రీగా లభించే వస్తువులు, సౌకర్యాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.. ఈ విషయం బంకుకీ వెళ్లే సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు. మీ వాహనం ఇంకా మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలు అందిస్తారు. మీరు కూడా మీ కారు లేదా బైక్‌తో పెట్రోల్ పంప్‌కు వెళితే ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ ఉపయోగిచుకోండి. చాల వరకు వీటిపై సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు ఫ్రీగా లభించే ఈ ఫెసిలిటీస్ కోసం డబ్బులు చెల్లిస్తుంటారు. మీ వాహన టైర్లలో సరైన మొత్తంలో గాలి ఉండటం చాలా ముఖ్యం, ఈ సర్వీస్ పెట్రోల్ బంకు దగ్గర పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మెషీన్స్ ద్వారా గాలి టైర్లలో నింపుతారు. చాలా చోట్ల ఈ పని కోసం ఒక ఉద్యోగిని కూడా పెడతారు.
కొన్ని కారణాల వల్ల వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే పంపు వద్ద ఉన్న ఫైర్ సేఫ్టీ డివైజ్ ఉపయోగించవచ్చు. ఈ సదుపాయం కూడా ఫ్రీగా అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మీరు పెట్రోల్ పంప్ నుండి ఉచితంగా కాల్ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన లేదా బ్యాటరీ అయిపోయిన వారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా గాయం లేదా చిన్న అత్యవసర పరిస్థితుల్లో మీరు పెట్రోల్ పంపు వద్ద ప్రథమ చికిత్స బాక్స్ ఉపయోగించుకోవచ్చు. దీనిలో గాయలకి కావాల్సిన అవసరమైన మందులు ఉంటాయి. ఇంకా వీటిలో పెట్టిన ముందుల డేట్ అయిపోయిందా లేదా గమనించాలి, ఎందుకంటే పెట్రోల్ పంప్ యజమానులు వాటిని అప్‌డేట్ చేయడం ముఖ్యం.
పెట్రోల్ పంపులో త్రాగునీరు సౌకర్యం కూడా ఉచితం. ఇక్కడ RO వాటర్ లేదా వాటర్ కూలర్ సదుపాయం ఉంటుంది, ఇంకా మీరు చల్లని అలాగే మంచి నీటిని తాగవచ్చు. ఏదైనా ప్రయాణంలో మీకు వాష్‌రూమ్ అవసరమైతే పెట్రోల్ పంప్‌లో ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. ఈ సర్వీస్ కేవలం డ్రైవర్లకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఉచిత సౌకర్యాల కోసం డబ్బులు వసూలు చేస్తే మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు. చాలా మందికి ఈ సేవల గురించి తెలియదు, దింతో ఒకోసారి సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు లేదా అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్రోల్ పంప్ ఓనర్లు ఈ సేవలను ఉచితంగా అందించడం తప్పనిసరి, కాబట్టి మీరు ఎప్పుడైనా పెట్రోల్ పంప్‌కు వెళ్లినప్పుడు ఈ సౌకర్యాలను ఫ్రీగా ఉపయోగించుకోండి. పెట్రోల్ పంప్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోతే లేదా వాటికోసం కోసం ఛార్జీ విధిస్తే మీరు పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా కంప్లంట్ చేయవచ్చు.