Suman : అలనాటి అందాల హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుమన్‌కు అప్పట్లో యువతులు చాలా మంది ఫ్యాన్స్‌గా ఉండేవారు. అంతటి అందం ఆయన సొంతం. అప్పట్లో ఆయన నటించిన అనేక సినిమాలు హిట్ కావడంతో ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడేవారు. దీంతో ఓ దశలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నాడు.
అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ అప్పట్లో కొన్ని కేసుల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయన సినీ కెరీర్ నాశనం అయిపోయింది. తరువాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం సహాయక పాత్రల్లో, విలన్‌గా నటిస్తూ మళ్లీ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే అప్పట్లో తనను ఆ కేసుల్లో ఇరికించిన వ్యక్తి గురించి సుమన్ తాజాగా చెప్పుకొచ్చారు.
తనను అశ్లీల చిత్రాల కేసులో ఇరికించింది దివాకర్ అనే వ్యక్తి అని.. అతనికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని సుమన్ తెలిపారు. ఓ ప్రైవేటు ఫ్యామిలీ ఎఫైర్ కు చెందిన సమస్యతో అతను తనను ఆ కేసుల్లో ఇరికించాడని తెలిపారు.
అయితే తాను జైలుకు వెళ్తానని తనకు ముందే తెలుసని.. అందువల్లే తన స్నేహితుడైన భానుచందర్ ను కాపాడేందుకు ప్రయత్నించానని సుమన్ తెలిపారు. తనకు ఫోన్ చేయవద్దని, తనతో మాట్లాడొద్దని భానుచందర్‌కు చెప్పానని.. తన వల్ల భాను చందర్ ఇబ్బందుల్లో చిక్కుకుపోవడం నచ్చలేదని.. అందుకనే అలా చేశానని సుమన్ తెలిపారు.
కానీ.. తనను కేసులో ఇరికించిన అసలు వ్యక్తిని వదిలేసి కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేశారని.. వేరే హీరోల పేర్లు బయటకు తెచ్చారని.. అసలు ఇండస్ట్రీతో తన కేసు సంబంధం లేదని.. తనను కావాలనే దివాకర్ కేసులో ఇరికించాడని.. సుమన్ తెలియజేశారు.