Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మూలిక‌లు

Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క క‌ల‌బంద‌.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Admin by Admin
December 24, 2021
in మూలిక‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloe Vera : క‌లబంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి ప‌దార్థం ఉంటుంది. అందులోనే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌ల‌బంద‌నే ఆయుర్వేదంలో ఘృత‌కుమారిగా కూడా పిలుస్తారు.

Aloe Vera is most healthful plant know its amazing benefits

క‌ల‌బందను ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఈ మొక్క అద్భుత‌మైన ఆరోగ్య ఫ‌లితాల‌ను ఇస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే పావు గ్లాసు మోతాదులో క‌ల‌బంద ర‌సం తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల‌ ఎన్నో వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. క‌ల‌బంద గుజ్జు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో వ్యాధులు న‌యం అవుతాయి. చ‌క్క‌ని సౌంద‌ర్య పోష‌క ద్ర‌వ్యంగా కూడా క‌ల‌బంద గుజ్జు ప‌నిచేస్తుంది.

క‌ల‌బంద మొక్క ఆకులు చిన్న గుత్తిగా వస్తాయి. త‌రువాత పొడవుగా పెరుగుతాయి. ఈ ఆకులు బాగా పెర‌గాలే గానీ పుష్టిగా, లావుగా త‌యార‌వుతాయి. ఒక్కో ఆకు 24 నుంచి 50 సెంటీమీట‌ర్ల పొడ‌వు పెరుగుతుంది. 4-8 సెంటీమీట‌ర్ల వెడ‌ల్పును క‌లిగి ఉంటాయి. ఈ ఆకుల అంచుల్లో ముళ్లు ఉంటాయి.

క‌ల‌బంద మ‌న‌కు ఎక్క‌డ చూసినా ల‌భిస్తుంది. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనూ క‌నిపిస్తుంది. క‌ల‌బంద ఆకులను విరిస్తే లోప‌ల తెల్ల‌ని, ప‌చ్చ‌ని స్రావం బ‌య‌ట‌కు వ‌స్తుంది. కొంత‌సేపు అయ్యాక అది గ‌ట్టి ప‌డుతుంది. దీన్ని వేడి చేస్తే ప‌లుచ‌ని ద్ర‌వంగా మారుతుంది. దీన్నే హెపాటిక్ అలోస్ అంటారు. తీవ్ర‌మైన మంట‌లో వేడి చేస్తే మ‌రీ ప‌లుచ‌న కాని ప‌దార్థంగా మారి గ్లాసీ అలోస్ గా మారుతుంది.

క‌ల‌బంద గుజ్జు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. ఆకులు బాగా పెరిగితే వాటిలోని గుజ్జు అంత‌గా చేదుగా అనిపించ‌దు. గుజ్జు జిగురు గుణం క‌లిగి ఉంటుంది. శ‌రీరానికి ఇది చ‌లువ చేస్తుంది. క‌ల‌బంద ఔష‌ధంగానే కాక మొటిమ‌ల వంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి కూడా మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేస్తుంది.

క‌ల‌బంద గుజ్జులో విట‌మిన్ ఇ, సి, బి1, బి2, 3ల‌తోపాటు బి6, ఐర‌న్‌, కాల్షియం, జింక్ వంటి పోష‌కాలు ఉంటాయి. క‌ల‌బంద గుజ్జులో 7 అత్యంత అవ‌స‌ర‌మైన అమైనో యాసిడ్లు ఉంటాయి. అందువ‌ల్ల జీర్ణ‌శ‌క్తికి మంచి టానిక్‌లా ప‌నిచేస్తుంది. ఈ గుజ్జు యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

 

మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. ప‌లు జీవ‌క్రియల కార‌ణంగా వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతుంటాయి. క‌ల‌బంద గుజ్జు వాటిని బ‌య‌టకు పంపిస్తుంది. శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. ఆక‌లి లేని వారు క‌ల‌బంద ర‌సం తాగితే ఆక‌లి పుడుతుంది.

పొట్ట‌లో ఉండే అల్స‌ర్లు, త‌ర‌చూ విరేచ‌నాలు అయ్యే ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్న‌వారు క‌ల‌బంద ర‌సాన్ని తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది. క‌ల‌బంద ర‌సాన్ని 3 టీస్పూన్ల చొప్పున ప‌ర‌గ‌డుపున తీసుకుంటే జీర్ణాశ‌యంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది.

క‌ల‌బంద ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. క‌ల‌బంద ర‌సం వాడ‌కం వ‌ల్ల కండ‌రాలు, కీళ్లు ఉత్తేజంగా మారుతాయి. ఆయా భాగాల‌లో ఉండే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

క‌ల‌బంద ర‌సాన్ని తీసుకుంటుంటే జుట్టు బాగా పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. దీంట్లో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ జుట్టు పెరుగుద‌లకు దోహ‌దం చేస్తాయి. క‌ల‌బంద ర‌సం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. గుండెల్లో మంట‌, కీళ్లు బిగుసుకుపోవ‌డం, షుగ‌ర్ వంటి వ్యాధులు త‌గ్గుతాయి.

క‌ల‌బంద ర‌సం దంతాల‌ను, చిగుళ్ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో బాక్టీరియా న‌శిస్తుంది. స్త్రీల జ‌న‌నేంద్రియాలు బ‌ల‌ప‌డ‌తాయి. జారిన లేదా సున్నిత‌మైన వాళ్ల అవ‌య‌వాలు దృఢంగా మారి గ‌ట్టి ప‌డతాయి.

త‌ర‌చూ జ‌లుబు, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ ఉన్న‌వారు క‌ల‌బంద ర‌సాన్ని రోజుకు 2 సార్లు పూట‌కు 2 టీస్పూన్ల చొప్పున తీసుకుంటుంటే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. అధిక బ‌రువు త‌గ్గిపోతారు.

కాలి ప‌గుళ్ల‌పై రాస్తుంటే ప‌గుళ్లు త‌గ్గుతాయి. జుట్టుకు వాడితే జుట్టు పెరుగుల బాగుంటుంది. జుట్టు స‌మ‌స్య‌లైన జుట్టు రాల‌డం, చుండ్రు త‌గ్గుతాయి. క‌ల‌బంద ర‌సాన్ని నేరుగా తాగ‌లేక‌పోతే ఏదైనా పండ్ల ర‌సంలో కలిపి 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వ‌చ్చు.

Tags: aloe veraక‌ల‌బంద
Previous Post

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులను అస్సలు చేయరాదు.. చేస్తే అంతే సంగతులు..

Next Post

Throat Pain : ఇలా చేస్తే.. చిటికెలో గొంతు నొప్పి మాయం..!

Related Posts

ఆధ్యాత్మికం

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన ఈ 10 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

July 12, 2025
ఆధ్యాత్మికం

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని తొలుత ఎవ‌రు ద‌ర్శించుకుంటారో తెలుసా..?

July 12, 2025
ఆధ్యాత్మికం

పితృ ప‌క్షాలు అంటే ఏమిటి..? వాటి వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి..?

July 12, 2025
వ్యాయామం

ఎక్స‌ర్‌సైజ్ చేసే వారు స‌డెన్‌గా దాన్ని ఆపేస్తే… లావై పోతారా? ఇందులో నిజమెంత??

July 12, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు?.. 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.