సాధారణంగా డయాబెటీస్ వున్న వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా వుందని రీసెర్చర్లు చెపుతున్నారు. వారు చేసిన ఒక స్టడీలో 60 శాతం మందికి రెండు వ్యాధులు వున్నట్లు తేలింది. డయాబెటీస్ రోగులు వారి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్ ను ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ, ఆహార పరంగాను, వ్యాయామ పరంగాను చర్యలు చేపట్టాలి.
సరైన ఆహారాలు తీసుకుంటూ జీవన విధానం మార్చుకుంటే ఈ రెండు వ్యాధులు నియంత్రించబడతాయి. ఈ రెండు వ్యాధులకు మూల కారణం అధిక బరువు సంతరించుకోవడమని, అధిక బరువుకు కారణం మాంసాహారం తినడం, అవసరమైన శారీరక శ్రమ లేకపోవడమేనని వీరు అభిప్రాయపడ్డారు.
ఆధునిక నగర జీవనంలో ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సమయానికి సరైన ఆహారాలు తీసుకునే సౌకర్యాలు లేకపోవడం, వారు శారీరక శ్రమకై తగిన వ్యాయామాలు చేయకపోవటంతో ఈ రెండు వ్యాధులు నియంత్రణ లేకుండా నానాటికి అధికమైపోతున్నట్లు స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్ అనే సంస్ధ తన పరిశోధనలో వెల్లడించింది.