టీవీ షోలకు భారీ టిఆర్పి రేటింగ్స్ రావాలంటే షో కాన్సెప్ట్ ఒకటే బాగుంటే సరిపోదు.. దాన్ని హ్యాండిల్ చేయగలిగే యాంకర్ కూడా ఉండాలి. అలాగే యాంకర్స్ అంటే కేవలం ఒకప్పుడు మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక్క టీవీ షోలకే కాకుండా.. మూవీ ఈవెంట్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినిమా ఇంటర్వ్యూలు ఇలా అన్నింటికీ యాంకర్స్ ఉండాల్సిందే. అయితే ఈ యాంకర్స్ కి ఒకప్పుడు పెద్దగా రెమ్యూనరేషన్ ఉండేవి కావు. కానీ ప్రస్తుతం మాత్రం యాంకర్స్ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అలా మనల్ని ఎంతగానో అలరించే ఈ యాంకర్స్ ఒక్కో షోకి ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ఎవరైనా చెప్పే మాట సుమా కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఆమె ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. సుమ ఒక్కో ఆడియో ఫంక్షన్ కి 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఆడియో వేడుకలకు మాత్రమే.. అవార్డు ఫంక్షన్ అయితే రేట్ మరోలా ఉంటుందట. సుమ తర్వాత చాలామంది మాటలకంటే కూడా గ్లామర్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపు రెండు లక్షల వరకు చార్జ్ చేస్తుందనే ప్రచారం ఉంది. ఈమధ్య ఈవెంట్స్, టీవీ షోలు తగ్గించిన అనసూయ పలు సినిమాలతో బిజీగా మారింది.
జబర్దస్త్ షో తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ.. ఒక్కో షో కి లక్షన్నర రేంజ్ లో పారితోషికం తీసుకుంటుంది. బుల్లితెరపై రాములమ్మగా సూపర్ పాపులారిటీ దక్కించుకుంది శ్రీముఖి. ఈమె ప్రస్తుతం లక్షన్నరకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో సిస్టర్ పాత్రలో చాలా సింపుల్ గా కనిపించిన మంజూష రాంపల్లి ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. ఈమె ఒక్కో ఈవెంట్ కు 50 వేల వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. యాంకర్ శ్యామల కూడా ఈవెంట్ లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈమె ఒక్కో ఈవెంట్ కు 50 వేలు పుచ్చుకుంటుంది. విష్ణు ప్రియ భీమినేని కూడా దాదాపు 30 నుంచి 50 వేల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నవ్య స్వామి గ్లామర్ కు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫిదా అవుతున్నారు. ఈమె ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 20 వేలు ఛార్జ్ చేస్తుంది. యాంకర్ ప్రశాంతి ఒక్కో ఎపిసోడ్ కి 15 వేలు చార్ట్ చేస్తుందనేది టాక్. అంతేకాదు కొన్ని ఈవెంట్స్ కు ఆమె హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంది. హీరోయిన్ నుంచి టీవీ నటిగా మారిన సుహాసిని ఒక్కో ఎపిసోడ్ కు 25 వేలు తీసుకుంటుందని టాక్. ఈమె హీరోయిన్ గా ఫేడౌట్ అయ్యాక ఇప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తోంది.