దేశవ్యాప్తంగానే కాదు, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ చిత్రాల హవా నడుస్తోంది. రాజమౌళి వంటి వారు తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాగా మారింది. అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. బిచ్చగాడి క్యారెక్టర్‌లో ధనుష్ అద్భుతంగా యాక్టింగ్ చేశాడని, ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.
కుబేర చిత్రానికి గాను బిచ్చగాడి క్యారెక్టర్‌లో నటించినందుకు ధనుష్ భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన తన పాత్రకు గాను ఏకంగా రూ.30 కోట్లను తీసుకున్నట్లు టాక్. ఇక సహాయ పాత్రలో నాగార్జున నటన అద్భుతమనే చెప్పాలి. ఆయన ఈ మూవీలో నటించినందుకు గాను రూ.14 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్‌గా రష్మిక మందన్న ఈ సినిమాలో చక్కగా నటించిందని అంటున్నారు. ఆమె పుష్ప 2 చిత్రానికి రూ.10 కోట్లు తీసుకోగా, కుబేర మూవీకి గాను రూ.4 కోట్లు తీసుకుందని తెలుస్తోంది.
కుబేర మూవీకి గాను రూ.120 కోట్లు ఖర్చు కాగా తొలి రోజు రూ.8 కోట్ల వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. అయితే మౌత్ టాక్ ఆధారంగానే తమ సినిమాకు ప్రజల నుంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఇక లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఏ మేర వసూళ్లను సాధిస్తుందో చూడాలి.