తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే. అయితే ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ తండ్రి తనయుల మల్టీ స్టార్ మూవీస్, ఏంటో ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ.. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అక్బర్ సలీం అనార్కలి, సింహం నవ్వింది వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఏఎన్ఆర్ – నాగార్జున.. అక్కినేని వారి తండ్రి కొడుకుల కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ అగ్ని పుత్రుడు, ఇద్దరు ఇద్దరే వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.
కృష్ణ – మహేష్ బాబు.. సూపర్ స్టార్లు ఇద్దరు గతంలో కలిసిన నటించిన వంశీ, టక్కరి దొంగ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. మోహన్ బాబు – మంచు విష్ణు.. వీరి కాంబినేషన్ లో రూపొందిన గేమ్, గాయత్రి వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. చిరంజీవి – చరణ్.. వీరి కాంబినేషన్ లో రూపొందిన బ్రూస్ లీ, ఆచార్య వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. కృష్ణంరాజు – ప్రభాస్.. ఈ పెద్దనాన్న, కొడుకులు కలిసి బిల్లా, రెబల్ చిత్రాల్లో నటించినా నిజ జీవిత పాత్రలో మాత్రం నటించలేదు. వీళ్ళిద్దరూ రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
నాగార్జున – అఖిల్.. అక్కినేని నాగార్జున, అఖిల్ తండ్రి తనయులైన వీళ్ళిద్దరూ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేదు. ఇక నాగార్జున, అఖిల్ హీరోగా తొలి చిత్రం అఖిల్ లో నాగార్జున ఓ పాటలో మెరిసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.