గుండెకి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెనొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి. ఇది మీ ఛాతీలో ఒత్తిడి, బిగుతు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇది మీ ఛాతీ మధ్యలో మొదలవుతుంది. మెడ, దవడ, చేతులు, మణికట్టు శరీర భాగాలకు వస్తుంది. దీని గురించి మరికొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకుందాం. అయితే, ఛాతీ నొప్పి అనేది గుండెకు సంబంధించిన లక్షణం మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇది ఇతర కారణాల కూడా వస్తుంది. అది గుండెపోటు కాకపోవచ్చు. 62 ఏళ్ళ జాన్, లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన గుండెనొప్పి వచ్చి తనకు తెలియకుండానే తన అనుభవాన్ని చెస్ట్ హార్ట్ అండ్ స్ట్రోక్ స్కాట్లాండ్ ద్వారా పంచుకున్నాడు. స్కాట్లాండ్‌లో డ్రైంగింగ్ చేస్తున్నప్పుడు జాన్ కొన్ని నిమిషాల పాటు వేడిగా చెమటతో బాధపడ్డాడు. ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అనిపించింది.
అతను లారీ ఆపి 20 నిమిషాల పాటు రెస్ట్ తీసుకున్నాడు. వెంటనే తను తేరుకుని మళ్లీ డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓ సంవత్సరం తర్వాత ఈ విషయాన్ని విన్న డాక్టర్ అది నిజానికి గుండెపోటు అని చెప్పాడు. చెస్ట్ హార్ట్ అండ్ స్ట్రోక్ స్కాట్లాండ్(CHSS) ప్రకారం, వేడిగా చెమటలు పోయడమే కాకుండా గుండెపోటుకి సంబంధించి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. చర్మ రంగు బూడిద రంగులోకి మారడం, పాలిపోయినట్లుగా ఉండడం అవుతుంది. నీరసం, భయం గుండెపోటు ఇతర లక్షణాలు ఇలా ఉంటాయి. మెడ, దవడ, వీపు, ఎడమ చేయి కింద, రెండు చేతుల్లో నొప్పి, అశాంతి, ఆందోళన, శ్వాస ఆడకపోవడం, మైకం ఉంటాయి.
గుండెపోటుకు సంబంధించిన సాధారణ లక్షణాలు పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ఉంటాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఛాతీ నొప్పి వచ్చే అవకావం కాస్త తక్కువగా ఉంటుంది. ఇతర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, మీరు, మీ చుట్టూ ఉన్న ఎవరికైనా గుండెపోటు ఉంటే మీరు వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయండి. గుండెపోటుకు ప్రధాన కారణం కరోనరీ హార్ట్ డిసీజ్. ఆరోగ్య వ్యాధుల ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆరోగ్య, జీవనశైలి కారకాలు. ధూమపానం, ఎక్కువ కొవ్వు ఉన్న ఫుడ్ తీసుకోవడం, షుగర్ వ్యాధి, హై కొలెస్ట్రాల్, హైబీపి, అధిక బరువు, ఊబకాయం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.