చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ ఉదయ్ కిరణ్ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన పేరు చెబితే చాలు.. మన కుటుంబ సభ్యుడు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఉదయ్ కిరణ్ పేరు చెబితే ఎవరైనా సరే భావోద్వేగానికి గురవుతారు. స్టార్ హీరోగా రాణించాల్సిన ఉదయ్ కిరణ్ పలు కారణాల్ల బలవన్మరణానికి పాల్పడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. వరుస ఆఫర్లతో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా ఉన్నాడు. కానీ అంతులేని విషాదాన్ని నింపి వెళ్లిపోయాడు.
ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్ దశలో ఉండగా వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆయన కెరీర్ సడెన్‌గా పడిపోయింది. సినిమా చాన్సులు రాలేదు. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో తీవ్రమైన మానసిక వేదనకు గురైన ఉదయ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అయితే ఉదయ్ కిరణ్ మృతి పట్ల ఇప్పటికీ చాలా మంది తోటి నటీనటులు స్పందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా నటుడు, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా ఉదయ్ కిరణ్ మృతిపై సంచలన కామెంట్స్ చేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కౌశల్.. ఉదయ్ కిరణ్ మృతిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే తనకు తెలుసని కౌశల్ అన్నాడు. ఉదయ్ బేగం పేటలో ఉండేవాడని, ఎంతో కష్టపడే వాడని తెలిపాడు. అయితే ఇండస్ట్రీలో ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనం ఉంటుందని, పైకి ఎదిగే క్రమంలో కిందకు లాగడం ఇండస్ట్రీ నైజం అని అన్నాడు. ఉదయ్ కిరణ్‌ను చాలా మంది మానసికంగా హింసించారని, ఆ విషయాన్ని తాను దగ్గరుండి చూశానని తెలిపాడు. అయితే ఆ టార్చర్ అనుభవించే కంటే చనిపోవడమే బెటర్ అని అన్నాడు. ఉదయ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. కాగా కౌశల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.