మనం రైలులో ప్రయాణించే సమయంలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూసేందుకు అడ్డంగా అమర్చిన కడ్డీలు రెండు కళ్లతో బయట ప్రపంచాన్ని పూర్తిగా చూడటానికి సౌకర్యంగా ఉంటాయి. అవి నిలువుగా అమర్చితే అవి మన కళ్లు చూడాల్సిన బయట దృశ్యాన్ని పూర్తిగా కనిపించనీకుండా కొంత ప్రాంతాన్ని బ్లాక్ చేస్తాయి.
వర్షం కురిస్తే అడ్డంగా అమర్చిన కడ్డీల మీద నీరు నిలబడదు. కానీ నిలువుగా కడ్డీలు అమర్చితే వాటి మీదుగా నీరు క్రిందకు జారుతూ అవి అమర్చడానికి ఏర్పరచిన రంధ్రాలోకి దిగి తుప్పు పట్టటానికి, నీళ్ళు నిలబడటానికి దోహదం చేస్తాయి.
రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు గాలి ప్రవాహం రైలు పక్కనుంచి అంతే వేగంతో బలంగా సమాంతరంగా కదులుతూ, తెరిచిన కిటికీల ద్వారా వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. నిలువుగా కడ్డీలు అమర్చినట్లతే, గాలి ప్రవాహానికి ఎదురు నిలుస్తాయి. దానివల్ల లోపలికి దూసుకొచ్చేగాలి హిస్స్ మని శబ్దం చేస్తూ వస్తుంది. దానివల్ల అసౌకర్యంగా ఉంటుంది. అడ్డంగా అమర్చిన కడ్డీలు గాలి ప్రవాహానికి సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఆ సమస్య ఉండదు.