డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది పూర్తిగా నయం కాదు. కానీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం. డయాబెటిక్ రోగులకు నిద్ర చాలా ముఖ్యమైనది, నిద్ర చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రలేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలంటే, రాత్రి నిద్రపోయే ముందు మీ దినచర్యను సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు టీ, కాఫీ, చాక్లెట్ సోడా వంటి కెఫిన్ కలిగిన వాటిని తినకూడదు.
కెఫిన్‌తో కూడిన పదార్థాలు మిమ్మల్ని నిద్రలేకుండా చేస్తాయి. దీనితో పాటు, ఆల్కహాల్ కూడా మానేయాలి. ఇది మీ నిద్రను చెడగొడుతుంది. నిద్రపోయే ముందు కొద్దిగా వాకింగ్ చేయడం మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకునే ముందు, లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల రాత్రంతా మీ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి, మీరు తగినంత సమయం నిద్ర పొందడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, మీరు ప్రతిరోజూ 6 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి సమయంలో జంక్ ఫుడ్స్, చిప్స్, స్వీట్ మొదలైన వాటిని తీసుకోవద్దు. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.
రాత్రి బాగా నిద్రపోవాలంటే మసాలాలు లేని తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరం. రాత్రిపూట బిర్యానీ, నాన్ వెజ్ లాంటివి తినడం మానుకోండి. దీనితో పాటు, రాత్రి 8 గంటల లోగా భోజనం తినడానికి ప్రయత్నించండి. ఆలస్యంగా తినడం మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది రక్తంలో చక్కెర స్థాయి పెంచుతుంది. రాత్రి నిద్రించడానికి గంట ముందు ఫోన్, ల్యాప్‌టాప్ టీవీకి దూరంగా ఉండండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడం అవసరం. మరుసటి రోజు భోజనాన్ని ఒక రాత్రి ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.అలాగే జంక్ ఫుడ్ వినియోగానికి దూరంగా ఉండగలుగుతారు.