కుక్క, పిల్లి, పక్షులు, చేపలు… ఇలా రక రకాల పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు. ఎవరైనా తమ ఇష్టాలను, అనుకూలతలను బట్టి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. ఇక ఐశ్వర్యవంతులైతే ఖరీదైన బ్రీడ్‌కు చెందిన వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. సరే, పెంపుడు జంతువులు, పక్షుల విషయంలో ఎవరి మాట ఎలా ఉన్నా వీటి గురించి హిందూ పురాణాలు, ఫెంగ్ షెయ్ వాస్తులు మాత్రం కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. ఏ జంతువును పెంచుకుంటే మనకు మంచిదో, దేన్ని పెంచుకోకూడదో ఆయా శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లిని ఇంట్లో పెంచుకుంటే అది మనకు మంచిది కాదట. హిందూ పురాణాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. యురోపియన్ నాగరికత సిద్ధాంతాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
పిల్లులు దుష్ట శక్తులకు, చేతబడి వంటి వాటికి నిలయంగా ఉంటాయని, అవి మంత్రగత్తెలుగా మారుతాయని యూరప్‌కు చెందిన పలు వర్గాలు వారు నమ్ముతారట. అందుకే వారు పిల్లుల్ని పెంచుకోరు. ఇంట్లో తాబేలును పెంచుకుంటే అది మనకు ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుందట. ధనవంతులుగా మారుస్తుందట. అది ఇంట్లో ఉంటే అదృష్టం మన వెంట ఉన్నట్టేనట. చాలా మంది అక్వేరియంలో చేపలను పెంచుతారు. నిజానికి అలా పెంచడం వల్ల లక్ కలసి వస్తుందట. అలాంటి వాతావరణంలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అందుతుందట. పాములు… వీటిని ఎవరూ కూడా పెంచుకోరు. చాలా తక్కువ మందే అలాంటి వారు ఉంటారు. అయినప్పటికీ ఎవరూ కూడా పాములను పెంచుకోకూడదట. అవి దురదృష్టాన్ని, నిత్యం సమస్యలను కలిగిస్తాయట.
శునకాలను పెంచుకోవడం మంచిదేనట. అవి ఉన్న ఇండ్లలో వాతావరణం పాజిటివ్‌గా ఉంటుందట. ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయట. ధనం లభిస్తుందట. ఇంట్లో చిన్నపాటి కొలను ఏర్పాటు చేసి అందులో కప్పలను పెంచితే అవి అదృష్టాన్ని కలిగిస్తాయట. ధనం బాగా సంపాదించగలుగుతారట. ఇంట్లో రామచిలుకలను పెంచుకుంటే అంతా మంచే జరుగుతుందట. అవి రాబోయే దురదృష్టాన్ని, సమస్యలను ముందే చెబుతాయట. లక్ తెచ్చి పెడతాయట. హిందూ పురాణాల ప్రకారం చెబితే పందులను అస్సలు పెంచుకోకూడదట. అవి ఎల్లప్పుడూ దురదృష్టాలనే తెచ్చి పెడతాయట. ఇంట్లోని వారందరికీ అనారోగ్య సమస్యలు కలుగుతాయట. గుర్రం అంటే శక్తికి నిదర్శనమట. దీన్ని ఇంట్లో పెంచుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయట. ముఖ్యంగా కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకునే వారు దీన్ని పెంచుకోవాలట. దాంతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందట.
తేలు… వీటిని పెంచే వారు ఈ నూటికో, కోటికో ఒక్కరుంటారు కావచ్చు. అయినప్పటికీ తేలును ఇండ్లలో పెంచకూడదు. అవి దురదృష్టాన్ని కలిగిస్తాయట. కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాయట. ఇంట్లో ఆవును పెంచుకుంటే సమస్యలన్నీ పోయి ప్రశాంతత కలుగుతుందట. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. హిందూ పురాణాల ప్రకారమైతే ఆవును పెంచుకోవడం అంటే ఇంట్లో సాక్షాత్తూ దేవతలందరినీ కొలువు ఉండేలా చేసుకున్నట్టేనట.