Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!

Admin by Admin
July 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది సన్నబ‌డటానికి తాము డైటింగ్ నియమాలు ఆచరిస్తున్నామంటూ అనేక మెరుగైన ఆహారాలు వదిలేస్తూంటారు. అసలు డైటింగ్ అంటే? మంచి పోషకాలు వుండే ప్రొటీన్లు, తక్కువ పిండిపదార్ధాలు లేదా కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా వుండేవి తినటం. అంతేకాని, అసలు ఏమీ తినకుండా ఖాళీ పొట్ట పెట్టి డైటింగ్ అనటం సరికాదు. శరీరానికి అవసరమైన శక్తి పొందాలంటే ఆహారం అవసరం. కనుక తక్కువ తింటూ త్వరగా బరువు తగ్గాలనటం సరి కాదు. తినండి… తినేది సరైనదో కాదో సరైన పరిమాణంలో వుందో లేదో పరిశీలించండి. పచ్చటి ఆకు కూరలు, పండ్లు, వంటివి మీ ఆహారంలో అధిక నీటిని ఇస్తాయి. త్వరగా జీర్ణం కాని పదార్ధాలు తినకండి. అనారోగ్యకరమైన బేకరీ జంక్ ఫుడ్ వదిలేయండి.

కార్బో హైడ్రేట్లు తగ్గించకండి. ఇవి తగ్గితే మీ జీవక్రియ వెనుకబడుతుంది. కేలరీలు తక్కువ వుండే ఆహారాలు తినండి. తినే దానిలో అవసరమైన పోషకాలన్నీ వున్నాయో లేదో చూసుకోండి. ఎంత ఆహారం వదలాలనుకుంటే తినాలనే వాంఛ పెరిగిపోతుందని గుర్తించండి. కనుక తినేవి పోషకాలు కలిగినవిగా ఎంపిక చేయండి. ఎలా తినాలి? నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమలటం ప్రధానం. మెల్లగా నములుతూ నోటిలోని లాలాజలంతోనే అది జీర్ణం అయ్యేలా తినాలి. నోటిలో అధికంగా ఆహారం పెట్టుకోకండి. ఒకేసారి ఎక్కువ ముద్దలు తినేవారికి అజీర్ణం గ్యాస్, పొట్ట నొప్పి వంటివి కలుగుతాయి. కనుక బాగా నమలండి. చిన్న ముద్దలు పెట్టుకోండి. ఎప్పుడైనా, మీరు కోరిన ఆహారాలు తప్పక ఒకసారైనా కొద్ది కొద్దిగా తిని మీ వాంఛలను తీర్చుకోండి. లేకుంటే మీకు తినాలనే ఆరాటం అధికమైపోతుంది.

if you are doing dieting then do not make these mistakes

అయితే దానిని అలవాటుగా మార్చి బరువు పెరగకండి. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక ఆచరించండి. పచ్చటి కూరలు అధికంగా, పప్పులు, ఓట్లు, గింజధాన్యాలు తినండి. ఎట్టి పరిస్ధితులలోను మధ్యాహ్న భోజనం వదలకండి. రోజులో చివరగా తినేది చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా ఎంచుకోండి. రాత్రులందు అన్నం తినకండి. అది అధిక కేలరీలను అందిస్తుంది. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ చేసే ముందుగా కనీసం ఒక గ్లాసు గోరు వెచ్చటినీరు తాగండి. ఇది మీరు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. సరైన ఆహారాలు సరైన మొత్తాలలో సరైన సమయంలో తింటూవుంటే మీ శారీరక రూపం ఎంతో ఆకర్షణీయం అనేది గ్రహించండి.

Tags: dieting
Previous Post

తెలుగు సినిమాల్లో విజువల్స్ పరంగా మంచి సినిమాలు ఏవి?

Next Post

స‌న్నబ‌డాల‌న్నా, షుగ‌ర్‌ను తగ్గించుకోవాల‌న్నా.. వీటిని తినండి..!

Related Posts

హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 12, 2025
పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025
lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.