మార్కస్‌బార్‌ట్లే, రవికాంత్‌నగాయిచ్, ఇషాన్‌ఆర్య, సంతోష్‌శివన్ , రత్నవేలు ఇంకా సెంథిల్‌కుమార్ మొదలైనవారు మన తెలుగు సినిమా సన్నివేశాలకు Visuals నాణ్యత పరంగా శిఖరాగ్రంలో నిలబెట్టారు. బాలీవుడ్ ఉద్ధండులు ఫర్థూమ్ ఇరానీ, ద్వారకా దివేచా,అనిల్ మెహతా, బినోద్ ప్రధాన్ లాంటి వారికి దీటుగా మన తెలుగు చిత్రాలను విజ్వలైజ్ చేశారు ! సినిమాలంటేనే శ్రవణ దృశ్యమాధ్యమం, కనుల కింపుగా చిత్రీకరించినవి పేర్కొనవలసివస్తే ప్రకృతి లోనా అంటే నదులు , పర్వతాలు ముఖ్యంగా అడవి నేపథ్యంలో నిర్మించిన చిత్రాలు, ఆ విజువల్స్ కచ్ఛితంగా ప్రేక్షకుల మనసులను విశేషంగా దోచుకుంటాయి. ఈ మధ్య వచ్చిన బాహుబలి లోని మన చూపులను కట్టి పడవేసే భారీ కట్టడాల సెట్టింగులతో అందాల కృత్రిమ జలపాతాలు, ఇంపైన వర్ణరంజితమైన వేషభూషణాల మేలు కలయికలను, మనోహరమైన ప్రకృతి వర్ణ దృశ్యాలు, సంభ్రమాశ్చర్యాలు కల్గించిన ఈ భారీ చిత్రం మనల్నే కాకుండా, వీక్షించిన ప్రతి ఒక్క దేశ విదేశ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సీజీలతో చిత్రీకరించిన గ్రాఫ్రిక్స్ లా కాకుండా సహజ వాతావరణంలో చిత్రీకరించినవి, సినిమా కథకు అవసరమైన నేపథ్యం, కుదిరిన వాతావరణంలో సినిమాను చూసేవారి కనుల కింపుగా ఉన్నవాటినే చెప్పుకుందాం. బాపు సినిమాలు మొదటి సినిమానుండి విజువల్స్ కే ప్రాధాన్యతనిచ్చినాడు, సాక్షీ నుండి బుద్దిమంతుడు, అందాలరాముడు మొదలైనవి, ఇక ముత్యాలముగ్గు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తే…. ముఖ్యంగా తెలుగు సినిమాలలోనే ఒక మాస్టర్‌పీస్ గా సంవత్సరంపాటు ఆడిన సినిమా గా నిల్చిన ముత్యాలముగ్గు సినిమా కోసం DOP గా పనికట్టుకొని బొంబైనుండి ఇషాన్‌ఆర్య ను పిలిపించితే , ఇషాన్ బాపు లు నటీ నటుల ముఖాలకు కోటింగ్‌లు రుద్దడం , రద్దు చేయించిన చిత్రం !! కథాగమనమంతా గోదావరి అందాలుతో మన అందరి మనసులను కొల్లగొట్టినంతగా బాపు కన్న మిన్న గొప్పవారలు మరి ఇంకెవ్వరు కానరారు ??
అదే ఇషాన్‌ఆర్య ఫోటోగ్రఫితో వచ్చిన బాపుసీతా కళ్యాణం తెలుగు వారు గుర్తుంచుకో దగిన దృశ్యకావ్యమనుకోవచ్చు, అందులోని గంగావతారణం ఘట్టం awesome visuals. విజువలైజేషన్ చిత్రకారుడు బాపు కళాత్మకమైన శైలి చిత్రీకరణ, అందరిని అలరింపజేసింది, అది ఆయన విశేష ప్రతిభకు నిదర్శనంగా ఉండిపోయింది. కిష్టయ్య అభిమానులు బాధపడరంటే ఒకమాట, కృష్ణ లెవల్‌కు గొప్పగా బాపు standard కు కొంచెం ఐన కృష్ణావతారంలో కూడా తన మార్కు విజువల్స్ ను చూడవచ్చు, ఇంచుమించు సినిమా కథ మొత్తంగా అడవి నేపథ్యంలోనే చిత్రీకరించిన అడవిరాముడు , వేటగాడు , అన్వేషణ ( కథ పరంగా జర్క్ ఫోటోగ్రఫి వల్ల కొద్దిగా డిస్టర్బ్ చేసినా) లాంటి సినిమాలు మనల్ని దృశ్యపరంగా ఆకట్టుకున్నాయి. సినిమాస్కోప్‌లో తీసిన దృశ్య కావ్యమనను కాని దృశ్య కథా చిత్రం అడవిరాముడు. ఆ టైంలో తెలుగు జనాలను మెస్మరైజ్ చేసింది ఈ అడవిరాముడు, సినిమా విజయానికి విజువల్స్ కూడా ముఖ్యపాత్ర వహించాయంటే అది అతిశయోక్తి కానేకాదండీ !! అవి కూడా ఒక కారణమైనది.
జగదేక వీరుడు అతిలోక సుందరి , దేవీ పుత్రుడు , మన ఇండియన్ జోన్ లో అంజీ, అరుంధతి , అమ్మోరు ,నాన్నకుప్రేమతో,భాగమతి ,మరీ ఈమధ్య సినిమా ముఖ్యంగా రంగ స్థలంను చెప్పుకోవాలి, గ్రామీణ నేపథ్యంలో మనకు నేత్రానందం కల్గించినది. ఈ సినిమా విజువల్స్ తోనే ఒక feel good సినిమా గా మనకు నిలిచి విజయాన్నందుకున్నది, ఇక్కడ పేర్కొన్న సినిమాలను బట్టి మిగితా చాలా తెలుగు సినిమాలను మీరు గుర్తుకు తెచ్చుకోవచ్చు.