మహా శివరాత్రి నాడు చాలా భక్తి శ్రద్ధలతో ఆ మహా శివుడికి పూజలు, వ్రతాలు, అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగారణ చేస్తూ.. శివనామస్మరణలో భక్తులు మునిగిపోతారు. అయితే శివరాత్రి రోజే కాదు, శివుడిని తరచూ పూజించాలి. శివుడు అత్యంత శక్తివంతమైన దేవుడు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని ప్రత్యేకత చాలా ఉంది. కానీ.. శివుని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా శివుడి జన్మ రహస్యం గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. హిందూపురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకరు. మొదటివాడు బ్రహ్మ, తరువాత విష్ణు, అనంతరం శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వయంభుగా వెలిసినట్లు భావిస్తారు. అంటే మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. అయితే శివుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం.
శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని పురాతన దేవుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం మానవుల నుంచి పుట్టలేదని శివుడి గురించి చెబుతారు. శివుడి జన్మ రహస్యం గురించి చాలా ఆసక్తికర కథ ఉంది. శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. ఒక రోజు బ్రహ్మ, విష్ణు ఏది అత్యంత శక్తివంతమైనదని వాదించుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక స్తంభం కనిపించింది. అయితే ఆది, అంతం ఏదీ కనిపించడం లేదు కానీ.. దైవవాక్యం చెబుతూ ఉన్నాడు. ఇద్దరు దేవుళ్లను ఈ స్తంభం మొదలు, చివర ఎక్కడ ఉందనే విషయం కనిపెట్టాలని దైవవాక్యం సూచిస్తుంది. తన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం బ్రహ్మ ఆ స్తంభం రూపు రేఖలను పరిశీలించాడు. విష్ణువు సమయం వృధా చేయడం ఎందుకని భావించి.. వరాహ రూపంలో అవతారమెత్తి.. భూమిలోకి వెళ్లాడు.. ఆ స్తంభం ఎలా పుట్టిందని కనుకొనే ప్రయత్నం చేశాడు.
ఇద్దరూ చాలా కష్టపడి కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ.. స్తంభం, మొదలు, చివర కనుక్కోలేకపోయారు. చివరికి వెనక్కి రావడంతో శివుడు కనిపించాడు. వాళ్లిద్దరి పక్కన మరో అద్భుతమైన శక్తి ఉందని.. రియలైజ్ అయ్యారు. ఈ విశ్వాన్ని పాలించే శక్తి పరమశివుడని భావించారు. ఇది శివుడి జన్మ రహస్యం. శివుడిని జన్మ రహస్యమే కాకుండా.. అవతారాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. దక్షుడి యాగాన్ని భగ్నం చేసి చంపేయడం వల్ల వీరభద్రుడి అవతారం, మరో సమయంలో కాలభైరవుడుగా అవతరించాడు. శివుడి జన్మ రహస్యంతో పాటు, విష్ణుతో ఉన్న స్నేహం వెనక ప్రముఖ కథ ఉంది. హనుమంతుడు రుద్రావతారంలో ఉంటాడు. శ్రీరాముడి అమితమైన భక్తుడు. ఇది విష్ణువు అవతారం.