చైనా దేశంలోకంటే భారత దేశంలో 6 రెట్లు, జపాన్ దేశంలోకంటే భారతదేశంలో 20 రెట్లు గుండె జబ్బులు అధికంగా వున్నాయి. అంతేకాదు, మనదేశంలో వచ్చే గుండె జబ్బులు చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి. నగరాలలో అంటే, ఉత్తర భారతదేశంలో సుమారుగా 10 శాతం మంది గుండెజబ్బులుగలవారుంటే, దక్షిణ భారతదేశంలో సుమారు 14 శాతం గుండెజబ్బుల జనాభా వున్నట్లు ప్రపంచంలోని అన్ని జాతులకంటే కూడా భారతదేశంలో గుండె జబ్బు మరణాలు అధికంగా వున్నాయి.
మనదేశంలోనే అత్యధికంగా చెప్పబడుతున్న ఈ గుండె జబ్బులకు కారణాలేమిటనేది పరిశీలిస్తే, గుండెజబ్బు అనేది మీరు పొగతాగేవారైనా, అధికబరువు కలవారైనా, అధిక రక్తపోటువున్నా, లేదా డయాబెటీస్, అధిక బ్లడ్ కొలెస్టరాల్ వున్నా, లేదా మీ వంశంలో ఎవరికేని గుండె జబ్బు వున్నా ఈ వ్యాధి వస్తుంది. ఈ రకమైన చరిత్ర వున్నవారు రిస్కు తగ్గించుకోటానికి గాను ముందస్తుగానే కరోనరీ హార్ట్ డిసీజ్ కు గాను పరీక్షలు చేయించుకోవాలి.
పరీక్షలు ఏ రకంగా చేయించుకోవాలి? డయాబెటీస్ లేదా రక్తపోటు వంటివి చేయించండి. లిపిడ్ ప్రొఫైల్, మంచి చెడు కొల్లెస్టరాల్, ఇసిజి, స్ట్రెస్ టెస్ట్, వంటివి చేయించాలి. ఛాతీ నొప్పి వున్నవారు ట్రెడ్ మిల్ టెస్టు చేయించాలి. 40 సంవత్సరాల వయసు పైబడిన వారు ఏదేని వ్యాయామం చేయాలనుకుంటే తమకు గుండె జబ్బు లేదని నిర్ధారించుకొనేటందుకు ట్రెడ్ మిల్ టెస్టులు తప్పని సరి.