Lakshmi Devi : చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని తప్పులు అసలు చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి అలా తిరుగుతూ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. కానీ అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీతోనే ఉండాలంటే కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా పాటించండి. మీ ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక బాధలు ఏమీ కూడా ఉండవు.
ఎప్పుడూ కూడా నీటిని వృథా చేయకూడదు. చాలామంది ట్యాప్ లని ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. నీటిని వృథా చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదు. నీటిని వృథా చేయడానికి లక్ష్మీదేవి ఒప్పుకోదు. కేవలం అవసరానికి మాత్రమే నీటిని ఉపయోగించాలి. అలానే సకల దేవుళ్ళలో ముందుగా ప్రార్థించాల్సింది వినాయకుడిని. ఎప్పుడూ కూడా వినాయకుడిని ప్రార్థించడం మర్చిపోకండి. పూజ మందిరంలో ఉన్న వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.
అదే విధంగా కొన్ని ఇళ్లల్లో చాలామంది చాలా రోజులు పూలను పెట్టి వాటిని తొలగించకుండా వదిలేస్తారు. అలా పూలని ఉంచకూడదు. వాడినా, వాడకపోయినా ఈరోజు పెట్టిన పూలని మరుసటి రోజు తీసేయాలి. ఇంటి తలుపులు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దం చేయడం మంచిది కాదు. దాని వలన ఇంట్లో తగాదాలు వస్తాయి. తలుపు విరిగిపోతే వాటిని వీలైనంత త్వరగా బాగు చేయించుకోవాలి. తలుపులు తీసినప్పుడు, వేసినప్పుడు శబ్దం వస్తే నూనె వేసుకోవడం మంచిది.
ఇంటి గోడల్లో పగుళ్లు ఉంటే వాటిని తిరిగి బాగు చేయించుకోండి. పగుళ్లు ఉన్నట్లయితే బంధాలు పాడవుతాయి. పగుళ్ళు ఉన్న గోడ సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవిని భక్తితో కొలవడం కూడా మరిచిపోకూడదు. ఇలా ఈ నియమాలని పాటిస్తే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఇంటిని ఎప్పుడూ బాగా ఉంచుకోవాలి. ఉత్తరదిక్కులో పూజలు చేయడం, ప్రతిరోజూ దీప ధూప నైవేద్యాలని పెట్టి స్వామిని పూజించడం చాలా మంచిది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.