వివాహం.. బర్త్ డే.. పదవీ విరమణ.. మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్.. రిసెప్షన్.. ఇలా మనం లైఫ్‌లో జరుపుకునే శుభ కార్యాలు అనేకం ఉంటాయి. ఇతరులు జరుపుకునే ఈ కార్యక్రమాలకు కూడా మనం అటెండ్ అవుతుంటాం. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఎలాగూ వట్టి చేతుల్తో వెళ్లం కదా. ఏదో ఒక గిఫ్ట్ వెంట తీసుకుని వెళ్లి ఇచ్చేసి వస్తాం. అయితే ఇలా శుభకార్యాల్లో ఇచ్చే గిఫ్ట్‌ల విషయానికి వస్తే చాలా మంది కామన్‌గా ఇచ్చే గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో.. అసలు అలాంటి గిఫ్ట్స్‌ను ఇవ్వవచ్చా, ఇవ్వరాదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వకూడదు.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏ శుభ కార్యం అయినప్పటికీ చాలా మంది పువ్వులను లేదా ఫ్లవర్ బొకేలను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. అయితే నిజానికి వీటిని గిఫ్ట్‌లుగా ఇచ్చేవారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం ప్రేమతో ఇచ్చే గిఫ్ట్ అది. అది ఒక రోజు అయితే పనికిరాదు. అంటే గిఫ్ట్ ఇచ్చిన రోజు ఆ పూలు బాగానే ఉంటాయి. తెల్లారి అవి వాడిపోతాయి. మరలాంటప్పుడు పూలను గిఫ్ట్‌గా ఇచ్చి ఏం ప్రయోజనం చెప్పండి. గిఫ్ట్ ఇస్తే అది వారి వద్ద కలకాలం ఉండేలా చూసుకోవాలి. దాన్ని చూసినప్పుడల్లా మనం గుర్తుకు వచ్చేలా గిఫ్ట్ ఇవ్వాలి. పూలను గిఫ్ట్‌లుగా ఇవ్వరాదు.
చాలా మంది కిచెన్‌కు సంబంధించిన కత్తులు, మగ్‌లు, పాత్రలు.. తదితరాలను గిఫ్ట్‌లుగా ఇస్తారు. దీంతో వాటిని తీసుకున్నవారు వాటిని మూలన పడేస్తారు. ఎందుకంటే ఇలాంటి వస్తువులు ఎవరి ఇండ్లలో అయినా కుప్పలుగా ఉంటాయి. అలాంటప్పుడు గిఫ్ట్‌లుగా వచ్చే వాటిని ఎవరు వాడుతారు చెప్పండి. కాబట్టి ఇలాంటి వస్తువులను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వకపోవడమే బెటర్. డైరీలు, పెన్నులు, పెన్సిళ్లు.. తదితర స్టేషనరీ ఐటమ్స్‌ను గిఫ్ట్‌లుగా అస్సలు ఇవ్వరాదు. వాటిని కేవలం చదువుకునే పిల్లలకు మాత్రమే ఇవ్వాలి. అవి వారికే ఉపయోగంగా ఉంటాయి. స్టేషనరీ ఐటమ్స్‌ను గిఫ్ట్‌లుగా ఇస్తే వాటిని ఎవరూ వాడుకోరు. మూలన పడేస్తారు. కనుక వీటిని బహుమతులుగా ఇచ్చేవారు ఒకసారి ఆలోచిస్తే బెటర్.
రాధాకృష్ణుల బొమ్మలు, తాజ్‌మహల్, చార్మినార్, ఈఫిల్ టవర్ లాంటి కట్టడాలను పోలిన నమూనాలు, ఇతర బొమ్మలను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదు. వాటిని మూలన పడేస్తారు. చాలా మందికి గిఫ్ట్ వోచర్లను బహుమతులుగా ఇవ్వడం అలవాటు. అయితే ఇది కొంత వరకు బాగానే ఉంటుంది కానీ మీరు ఇచ్చిన ఆ గిఫ్ట్ వోచర్‌ను వాడుకోగానే ఆ గిఫ్ట్ వోచర్‌ను తీసుకున్న వారు మీ గురించి మరిచిపోతారు. కనుక వీటిని కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వకపోవడమే మంచిది.