Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

గురు పౌర్ణ‌మి అంటే ఏమిటి..? దాని విశిష్ట‌త ఏమిటి..?

Admin by Admin
July 2, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం.. ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ… గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం. ఏ వ్య‌క్తికైనా మొద‌టి గురువు త‌ల్లే. ఆ త‌ర్వాత‌ మనకి జ్ఞానాన్ని అందించి… ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌ . గు అంటే అంధ‌కారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం. అంటే గురువు అనే ప‌దానికి అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ మౌఖికంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సాగిన వేద‌జ్ఞానాన్ని అంత‌టినీ ఒక్క‌చోట‌కు చేర్చి నాలుగు విభాగాలుగా విభ‌జించి వేద వాగ్మ‌యాల‌ను సామాన్యుడి చెంత‌కు చేరేలా చేయ‌డంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచ‌మ వేదంగా పేరు తెచ్చుకున్న మ‌హా భారతాన్ని మ‌న‌కు అందించిన వ్యాస భ‌గ‌వానుడు జ‌న్మించిన రోజు కాబ‌ట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస‌పూర్ణిమగా పాటిస్తున్నారు.

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలోశివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉప‌దేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యులయొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

what is guru pournami and its speciality

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతి స్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశ స్త్రాల్రు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జ‌యం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ త‌ర్వాతి కాలంలో మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! ఇంకా భాగవాతాన్ని రచించాడు. కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తార‌ట.

బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతార‌ట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి. హిందూ సంప్ర‌దాయాలు పాటించే భార‌త‌దేశం, నేపాల్, ఇంకా బుద్ధ‌, జైన సంప్ర‌దాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ రోజున ప్ర‌జ‌లు త‌మ ఆధ్యాత్మిక గురువుల‌ను స్మ‌రిస్తారు. పూజిస్తారు. బ‌హుమ‌తులు ఇస్తారు.గుడికి వెళ్లి ప్రార్థిస్తారు, దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

దేవుడిపై త‌మ‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు చేసే మ‌రో మార్గం ఉప‌వాసం ఉండ‌టం, గురువును పూజించి తాము మ‌రింత కాలం జీవించేందుకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

Tags: guru pournami
Previous Post

సాధార‌ణ వెల్లుల్లి కన్నా మొల‌కెత్తిన వెల్లుల్లిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయ‌ట‌..!

Next Post

ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది మ‌న భార‌తీయుడే అని మీకు తెలుసా..?

Related Posts

వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.