ఇంట్లో నిల్వ చేసిన వెల్లుల్లిపాయలు మొలకెత్తాయా..? పనికి రావని వాటిని పారేస్తున్నారా..? అయితే ఆగండి..! ఎందుకంటే సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లోనే చాలా పోషకాలు ఉంటాయట. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ మొలకెత్తిన వెల్లుల్లిపాయలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లో సాధారణం కన్నా ఓ మోస్తరు ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయట. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడ పీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయట. అలాంటిది ఆ మెటాబొలెట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి.
మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగు పడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మొలకెత్తుతున్న వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని అన్నాం కదా. అవును, అయితే అవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూడడమే కాదు, క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. దీంతో చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిపాయలను తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. బుద్ధి పెరుగుతుంది. నాడులన్నీ ఉత్తేజం అవుతాయి.
ఒక చిన్నపాటి కప్పు లేదా గ్లాస్లో దాని టాప్ వరకు శుభ్రమైన నీటిని నింపాలి. ఇప్పుడు ఓ వెల్లుల్లి రెక్క లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి 3 వైపులా టూత్పిక్లను గుచ్చాలి. అనంతరం ఆ టూత్పిక్ల సహాయంతో వెల్లుల్లిపాయను కప్పు పై భాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింది భాగంలో ఉండే వేర్ల వరకు మాత్రమే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. అంతే, ఒక 5 రోజులు ఆగితే వెల్లుల్లి మొలకెత్తుతుంది. అయితే వెల్లుల్లిని ఉంచిన కప్పును కిటికీల వంటి ప్రదేశాల్లో, సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. దీంతో మొలకలు బాగా వస్తాయి.