హీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బెంగళూరులో తమిళ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మడికి సంబంధించిన పిక్ వైరల్‌గా మారింది. ఈ అమ్మడు సినీ పరిశ్రమలో హీరోయిన్ కాగా,‘రెడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈమె ‘హనుమాన్’ సినిమాలో నటించింది. ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడ్రన్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే ఆమె ఎవరో మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆమె మరెవరో కాదు అమృత అయ్యర్. రెడ్ సినిమతో టాలీవుడ్‌కి పరిచయమై ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అర్జున ఫల్గుణ’ చిత్రంతోనూ ఆకట్టుకుంది. మొన్నటివరకు తమిళ సినిమాలు చేసినా ఈ భామ.. పాన్ ఇండియా మూవీ హనుమాన్‌లో హీరోయిన్ గా చేసింది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత అమృత అయ్యర్ మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అలా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
యాడ్స్ చేస్తున్న సమయంలోనే లింగ, పోలీసోడు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది అమృత అయ్యర్. వీటి వలన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దాంతో తెలుగులోనూ హీరోయిన్ గా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక హనుమాన్ సినిమా మంచి హిట్ దక్కించుకుంది.