హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ అయి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ అఖండ విజయం సాధించింది. రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.
అయితే కాంతారా సినిమా హిట్ తర్వాత తెలుగు ప్రేక్షకులు రిషబ్ శెట్టి పర్సనల్ జీవితం కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రిషబ్ శెట్టికి ఇప్పటికే పెళ్లి జరిగిపోయింది. రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2016లో ఓ సినిమా ఈవెంట్ లో రిషబ్ శెట్టి ప్రగతి శెట్టిని మొదటిసారి చూశారట. అంతేకాకుండా మొదటి చూపులోనే ప్రగతితో రిషబ్ ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత ఆమె కోసం ఫేస్ బుక్ లో వెతుకుతుంటే ప్రగతి శెట్టి రిషబ్ కు రిక్వెస్ట్ పెట్టింది.
అది చూసి ఆనందంలో రిషబ్ వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. కానీ రిషబ్ శెట్టిని అల్లుడిగా చేసుకునేందుకు ప్రగతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట. కానీ ప్రగతి పట్టుపట్టి అతడినే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ చాలా జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.