Indra Movie : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అందులో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఇంద్ర చిత్రం ఒకటి. బి గోపాల్ డైరెక్షన్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో రూ.10 కోట్ల (సుమారుగా)బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండించిందనే చెప్పాలి. ఇందులో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించగా..ముఖేశ్ రుషి, పునీత్ ఇస్సార్, ప్రకాశ్‌రాజ్, తణికెళ్లభరణి, శివాజీ, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో మెరిసారు.
ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు పైనే అయింది. ఇటీవల రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ అభిమానులతో కొన్ని విషయాలు పంచుకున్నారు. తొలుత సినిమా కథని దర్శకుడు బి.గోపాల్ వద్దన్నాడట. అందుకు కారణం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి రెండు సినిమాల్లో కూడా హీరో పాత్ర చిత్రీకరణ ఇంద్ర సినిమాలో మాదిరిగానే ఉండడం. ఈ సినిమా అదే కథాంశంతో తెరకెక్కిస్తే ప్లాఫ్ అవుతుందేమో అని గోపాల్ భయపడ్డారట. అయితే చిరంజీవి.. చిన్నికృష్ణతో కలిసి కథ చెప్పండని అన్నారట. ఇంటర్వెల్ వరకు కథ చెప్పగానే వెంటనే చిరంజీవి కిళ్లీ వేసుకొని ఇక మొత్తం అవసరం లేదు. సినిమా హిట్ అని అన్నారట.
తనికెళ్ల భరణి పోషించిన పాత్రని తననే చేయమన్నారని, డైలాగ్ రైటర్ అయిన నేను మూగ పాత్రలో నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారో నేను పాత్ర వదులుకున్నానంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. మణిశర్మ కంపోజిషన్‌లో వచ్చిన పాటలన్నీ ఆల్‌టైమ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. మెగా బ్లాక్ బాస్టర్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ సినిమా ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా ఆ రోజుల్లోనే 125 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకువచ్చింది.