వినోదం

శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదని ఆ డైరెక్టర్ ఏం చేయమన్నారో తెలుసా.? అప్పటినుండి ప్రతిసారి అదే ఫాలో అయ్యారు!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే&period;&period; బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి&period;&period; ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి&period;&period;ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా&period; &period;అంతా శ్రీదేవికే చెల్లింది&period;&period; అటువంటి శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు&period;&period; 1963&comma; ఆగస్ట్ 13&comma; మంగళవారం నాడు మద్రాసులోని శివకాశీలో పుట్టిన అమ్మాయి శ్రీ అమ్మ అయంగర్ &lpar; శ్రీదేవి&rpar;&period; నాలుగేళ్ల వయసులోనే తమ చిన్నాన్నతో ఒక ఫంక్షన్ కి అనుకోకుండా వెళ్లాల్సి రావడం అక్కడ ఒక కన్నడ కవి చిన్నారి శ్రీదేవిని చూసి ముచ్చటపడి &OpenCurlyDoubleQuote;మీ పాపకి సినిమాలో అవకాశం ఇస్తాను” అని శ్రీదేవి తండ్రికి చెప్పడం&period;&period; వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన శ్రీదేవి తండ్రి ముందు వద్దనుకొన్నా&period;&period; తల్లి మాత్రం శ్రీదేవిని ఎంకరేజ్ చేయడంతో మొట్టమొదటిసారి నాలుగేళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్పస్వామిగా &OpenCurlyDoubleQuote;తునైవాన్” &lpar;1967&rpar; లో వెండితెరపై మెరిసింది శ్రీదేవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్&period;జి&period;రామచంద్రన్ శ్రీదేవిని చూసి &OpenCurlyDoubleQuote;నమ్ నాడు” అనే చిత్రంలో నటింపజేశారు&period; ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి&period; పదేళ్ళ వయసులోనే శ్రీదేవి రోజుకి మూడు షిఫ్టుల్లో వర్క్ చేసేది అంటే అప్పట్లో ఆమె పరిస్థితి ఏంటో అర్దం చేసుకోవచ్చు&period; వరుస షూటింగ్ లతో స్కూల్ కి వెళ్లి చదువుకునే అవకాశంలేకపోయింది శ్రీదేవికి&period;&period; దాంతో షూటింగ్ గ్యాప్లో చదువుకునేది&period; శ్రీదేవి తండ్రి ఆమె కెరీర్ పట్ల కంటే ఆమె వ్యక్తిగత జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు&period; ఆమె నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ&period;&period; చదువు పక్కనేట్టకూడదని ఆమె కోసం సెట్ లో ఒక ట్యూటర్ ని ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71869 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sridevi-1&period;jpg" alt&equals;"do you know these important facts about sridevi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీదేవిపై ఆమె తల్లి ఇన్ఫ్ల్యూయెన్స్ చాలా ఉంటుందని చెప్పొచ్చు&period; చిన్నప్పట్నుంచి తల్లంటే ఎంతటి అభిమానం అంటే తల్లి మాటని వేదంలా భావించేది&period;&period; ఒకసారి శ్రీదేవి తల్లి ఆమెను ఓ గోడపై కూర్చోబెట్టి &OpenCurlyDoubleQuote;ఇక్కడే కూర్చో” అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి&period;&period; ఇంటి పనిలో నిమగ్నమైపోయింది&period; నాలుగైదు గంటల తర్వాత ఇంట్లో శ్రీదేవి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి చూస్తే&period;&period; అలా గోడ మీద బిక్కు బిక్కు మంటూ కూర్చున్న శ్రీదేవిని చూసి నిర్ఘాంతపోయిందట&period; రజనీకాంత్&comma; కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన&period;&period; బాలచందర్&comma; భారతీరాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి&period; పద్నాలుగేళ్ల ప్రాయంలోనే 20 ఏళ్ల అమ్మాయిగా నటించింది&period; సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు &OpenCurlyDoubleQuote;ఈ అమ్మాయి వయసు 14&sol;15 ఏళ్ళా &quest;&quest;” అని షాక్ అయ్యేవారు&period; అంతేకాదు రజనీకాంత్ కి సవతి తల్లిగా కూడా నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyDoubleQuote;నా తమ్ముడు” షూటింగ్ టైమ్ లో మౌంట్ రోడ్డు క్రాస్ చేసే షాట్ లో శ్రీదేవి నిజంగానే కార్ ను ఢీకొంది&period; అప్పుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని తన స్వహస్తాలతో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లారు&period; అప్పుడు శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్టు&period; ఆ తర్వాత ఆమెను &OpenCurlyDoubleQuote;పదహారేళ్ళ వయసు” సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు&period;&period; అప్పటికి శ్రీదేవి వయసు పద్నాలుగేళ్లే… శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు కూడా రాఘవేంద్రరావే&period; రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవికి ఆయన దర్శకత్వంలో 25à°µ సినిమాలో నటించి వారిద్దరి కాంబినేషన్ లో సిల్వర్ జూబ్లీ సినిమా రావాలని ఆశపడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71870" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sridevi-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyDoubleQuote;పదహారేళ్ళ వయసు” సినిమాని మొదట భారతీరాజా తమిళంలో తెరకెక్కించారు&period; కమల్ హాసన్ హీరోగా నటించగా&period;&period; విలన్ గా రజనీకాంత్ ముఖ్యపాత్ర పోషించిన సినిమా అది&period; ఆ సినిమాకి తమిళ ప్రేక్షకుల మనోభావాలకి తగ్గట్లుగా శాడ్ ఎండింగ్ ఇచ్చారు భారతీరాజా&period; శాడ్ ఎండింగ్స్ ని తమిళ ప్రేక్షకులు స్వాగతించినట్టుగా తెలుగు వారు ఆస్వాదించలేరు&period;&period; అందుకే&period;&period; ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన రాఘవేంద్రరావు క్లైమాక్స్ ను మార్చారు&period; తమిళ్లో కమల్ హాసన్-శ్రీదేవి చివరికి కలవరు&period; కానీ&period;&period; తెలుగులో శ్రీదేవి-చంద్రమోహన్ కలుసుకొంటారు… శ్రీదేవిని అందరూ అప్పట్లో రొమాంటిక్ హీరోయిన్ అని పిలుచుకొనేవారు &period;ఇప్పుడు కూడా శ్రీదేవి అందరికి శృంగార దేవతే&period;&period;కాకపోతే వాస్తవం ఏంటంటే ఆమెకు రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం రాదట&period; బాలచందర్ సినిమాలో నటిస్తున్న టైమ్ లో శ్రీదేవి రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదన్న కోపంతో షూటింగ్ ప్యాకప్ చెప్పేసారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత శ్రీదేవి ఇంటికెళ్ళి &OpenCurlyDoubleQuote;అమ్మాయికి కాస్త రొమాంటిక్ మూవీస్ చూపించండి” అని చెప్పారట&period; ఎన్ని సినిమాలు చూసినా శ్రీదేవి కెమెరా ముందు రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేకపోవడంతో&period;&period;&OpenCurlyDoubleQuote;నువ్వు కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు” అన్నారట&period; ఆ తర్వాత నుంచి రోమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చినప్పుడల్లా శ్రీదేవి అదే ఫాలో అయ్యేదట&period;&period; సీనియర్ ఎన్టీయార్ తో కలిసి &OpenCurlyDoubleQuote;బడిపంతులు” &lpar;1972&rpar; అనే చిత్రంలో మానవరాలిగా నటించిన శ్రీదేవి తర్వాత &OpenCurlyDoubleQuote;వేటగాడు” &lpar;1979&rpar;లో కథానాయికగా నటించింది&period; శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ అని&comma; తన వయసు పద్నాలుగేండ్లని రాఘవేంద్రరావు చెప్పినప్పుడు ఎన్టీయార్ &OpenCurlyDoubleQuote;దాందేముంది తన వయసు పద్నాలుగేళ్లయితే&comma; నా వయసు పద్నాలుగేళ్లే కదా బ్రదర్&quest;” అన్నారట&period; మనవరాలి వయసు పిల్లతో సినిమాలేంటి అని ముందు పెదవి విరిచిన వారే వేటగాడు సినిమాలో ఆ ఇద్దరి కాంభినేషన్ కి జనాలు వెర్రెత్తిపోవడంతో ముక్కున వేలేసుకున్నారట&period; వేటగాడు తర్వత ఎన్టీయార్ తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71872" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sridevi-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1973లో వచ్చిన &OpenCurlyDoubleQuote;భక్త తుకారాం” అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏయన్నార్ కి కూతురిగా నటించింది&period; ఆ తర్వాత 1981లో &OpenCurlyDoubleQuote;ప్రేమాభిషేకం” చిత్రంలో కథానాయికగా నటించింది&period; ఏయన్నార్ కాంబినేషన్ లోనూ 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి&period; చిరంజీవి సరసన &OpenCurlyDoubleQuote;రాణికాసుల రంగమ్మ&comma; జగదేకవీరుడు అతిలోక సుందరి&comma; ఎస్&period;పి&period;పరశురామ్” చిత్రాల్లో శ్రీదేవి కథానాయికగా నటించిన విషయమే అందరికీ తెలుసు&period; కానీ&period;&period; చిరంజీవి విలన్ గా నటించిన రెండు సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది&period; &OpenCurlyDoubleQuote;మోసగాడు” &lpar;1980&rpar;&comma; &OpenCurlyDoubleQuote;రనువ వీరన్” &lpar;1981&rpar; చిత్రాల్లో చిరంజీవి విలన్ గా నటించారు&period; శ్రీదేవి బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక తన చెల్లెలు శ్రీలతను నిర్మాతగా పెట్టి చిరంజీవి హీరోగా &OpenCurlyDoubleQuote;వజ్రాల దొంగ” చిత్రాన్ని మొదలెట్టారు&period; భారీ బడ్జెట్ తో తీదామనుకొన్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తోనే కారణాంతరాలవలన ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున సరసన &OpenCurlyDoubleQuote;ఆఖరి పోరాటం&comma; గోవిందా గోవిందా” చిత్రాల్లో నటించింది శ్రీదేవి&period; తండ్రి ఎఎన్నార్&comma; తనయుడు నాగార్జునతో నటించిన క్రెడిట్ శ్రీదేవికి మాత్రమే ఉంటుంది&period; వెంకటేష్ తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించింది&period; అదే &OpenCurlyDoubleQuote;క్షణ క్షణం”&period; వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్&period; అయితే&period;&period; పేరుకి ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినా&period;&period; కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే తిరగడం వలన ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో హీరో శ్రీదేవి&comma; నేను జస్ట్ పక్కన నటించాను అని వెంకటేష్ కూడా పేర్కొనడం విశేషం&period; &OpenCurlyDoubleQuote;లమ్హే” షూటింగ్ టైమ్ లో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది&period; అయితే&period;&period; వెంటనే బయలుదేరకుండా నిర్మాతకి నష్టం రాకూడదే ఉద్దేశ్యంతో ఆరోజు షూటింగ్ పూర్తి చేసుకొని మద్రాసు వెళ్ళి&period;&period; తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలను పూర్తి చేసి&comma; మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అనుపమ్ ఖేర్ తో ఒక కామెడీ సీన్ లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసి యూనిట్ సభ్యులందరూ నివ్వెరపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71871" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sridevi-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలి చూపులోనే శ్రీదేవిని ప్రేమించారట బోణి కపూర్&period; అయితే&period;&period; ఎన్నడూ ఆమెకు చెప్పలేదు&period; శ్రీదేవి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న టైమ్ లో ఆమె వెన్నంటి ఉన్నది బోణీకపూర్ మాత్రమే&period; శ్రీదేవి నైరాశ్యంతో బాధపడుతున్న తరుణంలో బోణీ పంచన చేర్చుకొని పెళ్లి చేసుకొంటానని అడగగా&period;&period; అప్పటికే ఆయన మంచితనం గురించి తెలిసిన శ్రీదేవి వెంటనే ఒకే చెప్పేసింది&period; పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తిపలికి కుటుంబానికి అంకితమైపోయింది&period; చిత్రపరిశ్రమలో శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు&period; కానీ రాంగోపాల్ వర్మ శ్రీదేవి మీద పెంచుకొన్న అభిమానం ముందు ఎవ్వరూ నిలువలేరు&period; అసలు వర్మ ఇండస్ట్రీకి వచ్చిందే శ్రీదేవిని దగ్గర నుంచి చూడొచ్చని అట&period; కేవలం శ్రీదేవి దృష్టిలో పెట్టుకొనే &OpenCurlyDoubleQuote;క్షణక్షణం” కథ రాసుకొన్నాడు ఆర్జీవి&period; ఆ సినిమాలో శ్రీదేవి ఒక పాట పాడడం విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts