Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. రీ ఎంట్రీ తరువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చిరు ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. మెగాస్టార్ 1978 లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.
ఆ తరవాత దాదాపు 10 సినిమాల వరకూ చేశాడు. కానీ కోతల రాయుడు అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించాడు. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ, వాసు కలిసి నిర్మించారు. ఇందులో మాధవి హీరోయిన్ కాగా చిరంజీవి కోతలు కోస్తూ అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాకు చిరు ఎలాంటి రెమ్యునరేష్ తీసుకోకపోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 2 వారాల ముందు ఎన్టీరామారావు, రజినీకాంత్ హీరోలుగా నటించిన టైగర్ అనే సినిమా విడుదలైంది.
ఈ సినిమా థియేటర్ లలో అప్పటికే రన్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం సినిమా విడుదలైంది. ఇలా 2 భారీ చిత్రాలు మధ్య చిరంజీవి మొదటి సినిమా కోతల రాయుడు విడుదలైంది. ఇక ఈ సినిమా ఆ 2 సినిమాలను బీట్ చేయడమే కాకుండా ఏకంగా 100 రోజులు ఆడింది. ఈ చిత్రానికి అప్పట్లో కాసుల వర్షం కురిసింది. దీంతో చిరు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తరవాత వరుస అవకాశాలు అందుకుని మెగాస్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని చిరు రికార్డ్ సృష్టించాడు.