Gunde Ninda Gudi Gantalu December 5th : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్‌లో రోహిణి ఫైనాన్షియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి వెళుతుంది. అయితే మీనా కూడా ఆ ఫైనాన్షియర్‌ని కలవడానికి వెళుతుంది. మీనా వచ్చిన విషయాన్ని రోహిణి గమనిస్తుంది. అంతేకాదు ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణి. ఇక ఫైనాన్షియర్ మీనాని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తాడు. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన చాలా కష్టపడుతున్నారని, చాలా అనుమానాలు ఎదుర్కొంటున్నాడని మీనా చెబుతూ చాలా బాధపడుతుంది. నీ మాటాలని నేను ఒప్పుకుంటా.. కానీ, బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని అందరి ముందు తనని కొట్టాడని ఫైనాన్సర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
అందరి ముందు తనకు క్షమాపణ చెప్పితే.. కారు ఇస్తానంటూ ఫైనాన్షియర్ అంటాడు. అప్పుడు మీనా ఆలోచన చేస్తుండగా, ఫైనాన్షియర్ నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా అవసరం లేదు వాడి బతుకు వాడు బతకని అంటూ ఫైనాన్షియర్ వెళ్ళిపోతాడు. అయితే ఇవన్నీ వింటున్న రోహిణి ఇంట్లో పంచాయితీ పెట్టాలని అనుకుంటుంది. అందరిని హాల్లోకి పిలుస్తుంది. ప్రభావతి మాట్లాడుతూ.. మీ ముద్దుల కొడుకు బాగోతం గురించి రోహిణికి ఏదో తెలిసిందట చెప్తుంది వినండి అంటుంది. దీంతో రోహిణి రెచ్చిపోతుంది. ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడు.పైగా ఆ ఫైనాన్సర్ ను బాలు కొట్టాడని చెబుతుంది. ఇప్పటి వరకూ బాలు లెక్కలు వేశాడుగా..నేను ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాం కదా.. ఇప్పుడు అన్నం తినేయడం మానేస్తారా అంటూ మనోజ్ నోరు జారతాడు. దీంతో మీనాకు ఇక్కడ లేని కోపం వస్తుంది.
తన భర్త మొగడు.. ఆయనకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదని, అవసరమైతే పస్తులు ఉంటామే తప్ప వేరొకరి సంపాదనపై ఆధారపడి బతకమని అంటుంది. పని చేయకపోయిన కూడా డబ్బులు ఇచ్చారు. మీ మాటలకి ఆయన ఆత్మాభిమానం చంపుకోలేక ఓ అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పనికి చేరారని చెప్పడంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు.ఇక సత్యం మాట్లాడుతూ ఇక చాలు అందరూ సైలెంట్ గా వెళ్లిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. బాలు రూమ్ లోకి వెళ్లగానే మీనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు ఫైనాన్షియల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? అంటూ నిలదీస్తాడు. అయినా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్లాలని అని అడుగుతాడు.
మీనా మాట్లాడుతూ.. ‘మీకు ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత పౌరుషం ఉంది కాదా.. మీరెందుకు అడుగుతారు.అవసరమైతే పల్లెటూర్లలో చెరువులలో బర్లు తోముతారు. ఎవరేమన్నా వారి కార్లను కడుగుతారు. మీ జీవితంలో మీరు ఎన్నడైనా దొంగతనం చేశారా? అలా పరాయి వాళ్ళు మీపై దొంగతనం నింద వేస్తే మీరు సైలెంట్ గా ఉన్నప్పుడైనా నా మనసు చచ్చిపోయింది. పరాయి వాళ్ళ కార్ల కడుగుతుంది ప్పుడే తన మనసు చచ్చిపోయిందంటూ మీనా బాధపడుతుంది. ఈ పొగరుతోనే ఇన్ని సమస్యలు తెచ్చుకున్నారని మీనా అనడంతో మీనాపై చేయి చేసుకునే ప్రయత్నం చేస్తాడు బాలు. వీరిద్దరి మాటల్ని సత్యం చాటుగా వింటాడు. దీంతో తన కొడుకుకు ఏదైనా ఉపాధి కలిగించాలని భావించి ఊహించని గిఫ్ట్ ఇస్తాడు సత్యం.